Budget 2024: నీలిరంగు చీరలో నిర్మలమ్మ.. ఇవి ఫైనాన్స్ మినిస్టర్ శారీ కలెక్షన్స్ ..

Finance Minister Nirmala Sitharaman Saree Colour Meaning: ఈరోజు 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోదీ ప్రభుత్వ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీంతో నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే, ప్రతిసారి మన పైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్రత్యేకరంగు చీరను ధరించి రావడం మీరు గమనించారా? ప్రతి రంగు చీరకు ఓ అర్థం ఉంది. మరి ఈసారి నిర్మిల సీతారామన్ ఏ రంగు చీర కట్టుకున్నారు దాని అర్థమెంటో తెలుసుకుందాం.  
 

1 /6

భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019 బడ్జెట్ సమావేశానికి గులాబీ రంగు చీరను ధరించారు. ఇది స్థిరత్వానికి ప్రతీక.  

2 /6

2020 బడ్జెట్ సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పసుపు రంగు చీరను ధరించారు. ఇది ఉత్సాహం ,శక్తికి చిహ్నం.  

3 /6

2021 సాధారణ బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ ఎరుపు రంగు చీరను ధరించి బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఎరుపు రంగు బలం ,సంకల్పానికి చిహ్నం.  

4 /6

2022 బడ్జెట్ సమర్పణ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్రౌన్ కలర్ చీరను ధరించారు. ఈ రంగు భద్రతకు చిహ్నం.  

5 /6

2023 గత ఏడాది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎరుపు, నలుపు రంగు మిక్స్ కలర్ చీరలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ రంగు శౌర్యం ,శక్తికి చిహ్నం.  

6 /6

2024 మధ్యంతర బడ్జెట్ సమయంలో నిర్మలమ్మ బ్లూ లీఫ్ ప్రింటెడ్ చీరలో కనిపించారు. నీలం రంగు శాంతి, స్థిరత్వం, ప్రేరణ, జ్ఞానం ,నమ్మకానికి చిహ్నం. ఇది చల్లని రంగు కూడా.