Ram mandir Opening: మరో 48 గంటల్లో అయోధ్య రామమందిరం ప్రారంభం కానుంది. జనవరి 22వ తేదీ మద్యాహ్నం బాలరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమముంది. ఈ నేపధ్యంలో కొన్ని రాష్ట్రాలు, వివిధ సంస్థలు సెలవు ప్రకటించాయి. ఏయే రాష్ట్రాలు, ఏయే సంస్థలు సెలవు ప్రకటించాయో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జనవరి 22 రాముడి ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకుని చాలా ప్రాంతాల్లో మార్కెట్ క్లోజ్ చేయనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు సైతం మూతపడనున్నాయి. కొన్ని చోట్ల పబ్లిక్ హాలిడే ప్రకటించారు. రామమందిరం ప్రారంభోత్సవం సందగర్భంగా స్టాక్ మార్కెట్‌కు ఆ రోజు సెలవు ప్రకటించారు. అయితే అందుకు బదులుగా ఇవాళ శనివారం ఉదయం 9 గంటల్నించి మద్యాహ్నం 3.30 గంటల వరకూ స్టాక్ మార్కెట్ పనిచేస్తుంది. మనీ డెరివేటివ్ సెగ్మెంట్ జనవరి 22న క్లోజ్ కానుందని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తెలిపింది. అటు నగదు మార్కెట్‌కు కూడా జనవరి 22న సెలవు ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. అంటే ప్రభుత్వ సెక్యూరిటీ, విదేశీ మారక ద్రవ్యం వంటివి పనిచేయవు.


ఇక జనవరి 22వ తేదీని కొన్ని రాష్ట్రాలు పబ్లిక్ హాలిడే ప్రకటించాయి. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో హాఫ్ డే సెలవు ఉంటే మహారాష్ట్ర, పుదుచ్చేరి, చండీగడ్‌లో రోజంతా పబ్లిక్ హాలిడే ఉందని వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో స్కూల్స్, కళాశాలలకు సెలవు ఇచ్చేశారు. ఇక ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీ సైతం ఆ రోజు హాఫ్ డే సెలవు ఇచ్చింది. యూపీలో మొత్తం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లో విద్యా సంస్థలకు సెలవిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా దేశంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సంస్థలకు సగం రోజు సెలవు ఇచ్చింది. అంటే మద్యాహ్నం 2.30 గంటల వరకూ ఆఫీసులు పనిచేయవు.


ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులు, భీమా కంపెనీలు, ఆర్ధిక సంస్థలు, గ్రామీణ బ్యాంకులకు కూడా హాఫ్ డే సెలవు ప్రకటించింది ప్రభుత్వం. దీనికితోడుగా భీమా సంస్థలు కూడా ఆ రోజు హాఫ్ డే సెలవు ఇచ్చాయి. రిలయస్స్ ఇండస్ట్రీస్ కార్యాలయాలకు జనవరి 22న సెలవు ప్రకటించింది సంస్థ. 


Also read: Ram mandir flags: మీ ఇంటిపై రామ మందిరం జెండా ఎగురవేస్తున్నారా, ఈ వాస్తు నియమాలు పాటించండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook