Ayodhya Ram Mandir: దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా అందరి నోటా శ్రీ రామ నామమే మారుమోగుతోంది.5 శతాబ్డాల సుధీర్ఘ నిరీక్షణ. ఎన్నో దశాబ్దాల పోరాటాలు వెరసి అయోధ్యలో భవ్య రామ మందిరం కల సాకారం అవుతోంది. అయోధ్యలోని  శ్రీరామ్ లల్లా ( బాలరాముని) విగ్రహ ప్రతిష్ఠ ఈ నెల 22న మధ్యాహ్నము 12:29 - 12:30 సమయానికి జరుగనున్నట్లు  మనందరకూ తెలిసిందే కదా.  అయితే, ఆ ముహూర్తం సరియైనదేనా? తెలుగు ప్రజలు అంతగా ప్రాముఖ్యత ఇవ్వని పుష్య మాసంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేయవచ్చునా ? ఇటువంటి సందేహాలు చాలామంది లేవనెత్తుతున్నారు. దీనిపై పండితులు ఏమంటున్నారంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. Ayodhya Ram Mandir: అసలు పుష్యమాసంలో రామ విగ్రహ ప్రతిష్ఠ సరియైనదేనా?


#సమాధానం : - నిస్సందేహముగా సరియైనదే అని పండితులు చెబుతున్నారు. దేవతా ప్రతిష్ఠలకు పుష్యమాసం పనికి వస్తుందని జ్యోతిష గ్రంథాలలో ఉన్నదే.


సర్వేషాం_పౌషమాఘౌ_ద్వౌ_విబుధస్థాపనే_శుభౌ " - అని  బృహస్పతి తెలిపినదే. అంటే ఏ దేవతకైనా సరే పుష్యమాసం, మాఘమాసం శుభకరం  అని ధర్మ సింధువుతో పాటు నిర్ణయ సింధువు చెబుతోంది. పైగా, ఒక్కొక్క మాసంలోని ప్రతిష్ఠకు ఫలితాలను కూడా తెలుపుతూ.. #పౌషే_రాజ్యవివృద్ధిస్యాత్ .... అని కూడా తెలియజేయడం జరిగింది. దీనర్థమేమంటే... "పుష్యమాసం లో దేవతా ప్రతిష్ఠ జరిగితే ,రాజ్యం విశేషంగా అభివృద్ధి చెందుతుందిని అర్ధం.


మనతెలుగు రాష్ట్రాలలో పుష్యమాసం అంటే శూన్య మాసం అని తలుస్తాము. అయితే, సూర్యుడు మకరరాశి లోకి ప్రవేశించిన తర్వాత వచ్చే పుష్యమాసం వివాహాం, గృహారంభం,గృహప్రవేశాదులకు పనికి వస్తుందని ముహూర్త గ్రంథాలలో స్పష్టంగా ఉంది. #మకరస్థే_సూర్యే_పౌషే_శుభమ్ అని అంటూ #నిషేధస్తు_ధనురర్కవిషయః అని పీయూషధారయందు స్పష్టపరచటం జరిగింది.


2. తిథులలో ద్వాదశి తప్ప ఇంకేమీ దొరకలేదా ?అనే ప్రశ్నకు  


#సమాధానం : ద్వాదశీ తిథికి అధిపతి విష్ణుభగవానుడు.
#యద్దినే_యస్యదేవస్య_తద్దినే_తస్యసంస్థితిః" - అని నారదమహర్షి వాక్యము. అందువలన విష్ణు భగవానుని అవతారమైన శ్రీరామచంద్రుని ప్రతిష్ఠకు ద్వాదశి ని మించిన తిథి ఏమున్నది? ద్వాదశ్యాం_హరేశ్చ..... అని అగ్నిపురాణమందు కూడా ఉన్నది.


3. ప్రతిష్ఠ మిట్టమధ్యాహ్నం చేయడమేమిటి ?


#సమాధానం: అభిజిత్ - ముహూర్తంలో ఏమి చేసినా అక్షయ ఫలితాన్ని ఇస్తుందని మత్స్యపురాణ వచనం.
अपराह्णे तु संप्राप्ते अभिजिद्रोहिणोदये ।
 यदत्र दीयते जन्तोस्तदक्षयमुदाहृतं” ॥ इति मत्स्यपुराणं ॥


అంతేకాక, శతృనిర్మూలనం కూడా జరిగి తీరుతుంది.
अभिमुखीभूय जयति शत्रून्.... इति वाचस्पत्यम्


4. శుభముహూర్తమేనా? గ్రహస్థితి బాగుందా? చరలగ్నంలో ప్రతిష్ఠ ఏమిటి?


#సమాధానం : ముహూర్తం బాగుంది. లగ్నంలో గురుడున్నాడు. ఎన్నో దోషాలను పోగొట్టే విధంగా లగ్నబలాన్ని కలిగి ఉంది ముహూర్తం.ముఖ్యంగా చర, స్థిర,ద్విస్వభావ లగ్నాలు ఏవీ కూడా మేషలగ్నమంత బలం కలిగి లేవు. మేషం చరలగ్నమైనా, నవాంశలో ద్విస్వభావ లగ్నం అవడం, శుక్రుడు లగ్నాన్ని వీక్షిస్తూ ఉండటం వలన దోషరహితమైనది.


లగ్నే_స్థిరే_చోభయరాశియుక్తే
నవాంశకే_చోభయగే_స్థిరే_వా  .... అని వసిష్ఠ సంహిత పేర్కొంది.


పైగా లగ్నం నుండి ద్వితీయభావమందు ( రాశియందు కాదని గమనించండి) చంద్రుడు ఉండటం ఎంతశుభప్రదమో వింశోపక బలం తెలిసినవారికి సులువుగా అవగతమౌతుంది. దీనివలన రాబోయే కాలంలో దేశమంతటా రామమందిరాలు అనేకం కొలువు తీరనున్నాయి. దేశం శుభ పరిణామాలు చవిచూస్తుందని వసిష్ఠమహర్షి వచనం.
లగ్నాద్ద్వితీయే శుభఖేచరేంద్రాశ్చంద్రాశ్చ పుత్రార్థశుభప్రదాస్స్యుః.....


అందువలన ముహూర్త విషయం లో సందేహాలు మాని.... ఆ శ్రీరామమందిర ప్రతిష్ఠా మహోత్సవాన్ని వీక్షించి....
ఆ రోజు ప్రతి ఇంట దీప మాలికలను వెలిగించి.....
దీపావళి పండుగ జరుపుకుందామని పండితులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా ముష్కరుల చేతిలో 1528లో కూలగొట్టబడిన అయోధ్య రామ మందిరం.. 5 శతాబ్దాల సుధీర్ధ నిరీక్షణ తర్వాత మరికొన్ని గంటల్లో ప్రాణ ప్రతిష్ఠ ముహూర్తంతో కొలువు తీరనుంది. దీనికి గుర్తుగా ప్రతి కుటుంబం ఇంటి ముందు 5 దీపాలు వెలిగించి దీపోత్సవము జరుపుకోవాలని కోరుతున్నారు.


Also Read: Shoaib Malik Third Marriage: సానియా మీర్జాకు భారీ షాక్.. మళ్లీ పెళ్లి చేసుకున్న భర్త షోయబ్ మాలిక్


Also Read: TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్‌ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter