Ayodhya Ram Mandir: అయోధ్యలో వివాదాస్పద బాబ్రీ మసీదు 1992లో  కూల్చివేత జరిగినప్పటికీ దీనిపై దాదాపు 134 యేళ్ల సుధీర్ఘ న్యాయ పోరాటమే చేసారు రామ భక్తులు. శతాబ్ధాల కల.. దశాబ్దాల పోరాట ఫలితంగా చివరకు అయోధ్య భవ్య రామ మందిరంలో శ్రీరాముడు కొలువు తీరనున్నాడు. . దీని వెనక ఉన్న సుదీర్గ న్యాయ పోరాటమే ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1885: బాబ్రీమసీదు వివాదానికి సంబంధించి ఫస్ట్ కేసు నమోదైంది.బాబ్ రీమసీదు ప్రాంగణంలో మందిరాన్ని నిర్మించాలని భావించిన మహంత్‌ రఘుబీర్‌దాస్‌కు అప్పట్లో అనుమతి లభించలేదు.


1949: బాబ్రీ మసీదు ప్రధాన గుమ్మటం కింద రహస్యంగా  బాల రాముడు (రామ లల్లా) విగ్రహాలను ఎవరో ప్రతిష్టించారు.


1950-61:బాల రాముడికి పూజలు నిర్వహించటం లేదా వివాదాస్పద స్థలాన్ని అప్పగించటానికి 4 వేరు వేరు కేసులు దాఖలయ్యాయి.


1986: అప్పట్లో తాళాలు తెరవాలంటూ ఫజియాబాద్‌ జిల్లా కోర్టు న్యాయమూర్తి ఆదేశించటంతో హిందువులకు అక్కడ పూజలు చేయటానికి అనుమతి లభించింది.


1989:అయోధ్య రామ మందిరం కొరకు పేరుకు పోయిన 4 అపరిష్కృత కేసులను అలహాబాద్ (ప్రయాగ) ‌ హైకోర్టుకు బదలాయించారు.


1991:రామ్‌ లల్లా (బాల రాముడు) దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం నిర్మాణానికి చుట్టుపక్కల భూమిని యూపీ (ఉత్తర ప్రదేశ్) ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.


1992 డిసెంబరు: కరసేవకుల బృందం కోపోదిక్త్రులై బాబ్రీ మసీదును కూల్చివేసింది. దీనిపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి. ఒకటి- మసీదును కూల్చివేసినందుకు అజ్ఞాత కరసేవకులపై. రెండోది- మసీదు కూల్చివేతకు ముందు మతపరమైన ప్రసంగాలు చేసినందుకు భారతీయ జనతా పార్టీ  నేతలు లాల్ కృష్ణ ఆడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీ,ఉమా భారతి తదితరులపై


1993: బాబ్రీ (అయోధ్య రామ జన్మభూమి) చుట్టుపక్కల గల 67 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. బాబ్రీ మసీదు నిర్మాణానికి ముందు అక్కడ హిందువుల మందిరం ఉందో లేదో అనే దానిపై అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టును కోరింది.


1993, అక్టోబరు: ఆడ్వాణీ, ఇతరులు కుట్రకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సీబీఐ ఉమ్మడి అభియోగపత్రాన్ని దాఖలు చేసింది.


1994:  ఆ తర్వాత కేసు తిరిగి అలహాబాద్‌ హైకోర్టు లక్నో ధర్మాసనానికి చేరుకుంది.


1996 నుంచి: మళ్లీ కేసుల విచారణ తిరిగి ప్రారంభమైంది.


2001, మే 4: ఎల్.కే.అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతి, బాల్‌ఠాక్రే, ఇతరులపై సీబీఐ ప్రత్యేకకోర్టు న్యాయమూర్తి కుట్ర అభియోగాలను తొలగించారు.


2004, నవంబరు 2: టెక్నికల్ కారణాల ఆధారంగా బీజేపీ నేతలపై కుట్ర అభియోగాలను తొలగించటాన్ని సీబీఐ అలహాబాద్‌ హైకోర్టులో సవాలు చేసింది. దీనిపై కోర్టు నోటీసులు జారీచేసింది.


2010, మే 20: ప్రత్యేక కోర్టు ఉత్తర్వును సమర్థిస్తూ అలహాబాద్‌ హైకోర్టు అడ్వాణీ, ఇతరులపై కుట్ర అభియోగాలను తొలగించింది.


2010, సెప్టెంబరు 30: అలహాబాద్‌ హైకోర్టు అయోధ్య ప్రాంతంలో రెండింట మూడొంతుల స్థలాన్ని హిందూ పక్షాలకు, ఒక వంతు స్థలాన్ని వక్ఫ్‌బోర్డుకు కేటాయించింది.


2011, ఫిబ్రవరి: కుట్ర అభియోగాలను తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై సీబీఐ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.


2011, మే 9: అలహాబాద్‌ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది.


2017, మార్చి 6: బాబ్రీ కూల్చివేత కేసులో బీజేపీ నాయకులపై కుట్ర అభియోగాన్ని పునరుద్ధరించే విషయాన్ని పరిశీలించే అవకాశముందని సుప్రీంకోర్టు సూచించింది.


2017, మార్చి 22: ఇరు పక్షాలు కోరుకుంటే అయోధ్య వివాదాన్ని పరిష్కరించటానికి చర్చల్లో పాల్గొనే వ్యక్తిని నియమించటానికి సుప్రీంకోర్టు సుముఖత వ్యక్తం చేసింది.


2017,ఏప్రిల్‌ 6: ఈ కేసులో కాలావధితో విచారణ పూర్తి చేయటానికి సుప్రీంకోర్టు అనుమతించింది.


2017, ఏప్రిల్‌ 19: ఆడ్వాణీ, జోషీ, కేంద్ర మంత్రి ఉమాభారతి, తదితర నేతలపై నేరపూరిత కుట్ర అభియోగాన్ని సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. ప్రముఖులు, కరసేవకులపై అపరిష్కృత అంశానికి సంబంధించిన విచారణను కలిపేసింది.


2019 నవంబర్ 9న అయోధ్యలో రాముడు జన్మించాడని చారిత్రక ఆధారాలతో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
 
2020 ఆగష్టు 5న అయోధ్య రామ జన్మభూమిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగింది.


2022 జనవరి 22న అయోధ్యలో నిర్మించిన భవ్య రామ మందిరంలో బాల రాముడుగా కొలువు తీరనున్నాడు.


Also Read: Suryavanshi Thakur: ఐదు వందల ఏళ్ల తర్వాత నెరవేరిన శపథం.. పట్టువదలని సూర్యవంశి ఠాకూర్‌ వంశీయులు


Also Read: APCC Chief YS Sharmila: తొలి రోజే స్వరాష్ట్రం ఏపీలో వైఎస్‌ షర్మిలకు ఘోర అవమానం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook