అయోధ్య మొన్నటివరకూ ఓ వివాదాస్పద ప్రాంతం. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అయోధ్య బాబ్రీ మసీదు స్థానంలో భవ్య రామమందిర నిర్మాణం ప్రారంభమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామమందిరం ప్రారంభం తేదీ ఖరారైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచ హిందువులంతా ఆతృతగా ఎదురుచూస్తున్న భవ్య రామమందిరం ఎప్పుడనేది ఖరారైంది.  2024 ఎన్నికలకు కొద్దిగా ముందు భవ్య రామమందిరం ప్రారంభం కానుంది. 2024 జనవరి 1వ తేదీన రామమందిరం ప్రారంభం కానుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. త్రిపురలో ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా ఈ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అయోధ్య అంశాన్ని న్యాయస్థానాల్లో నిలిపితే..సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మోదీ భూమి పూజతో రామమందిర నిర్మాణం ప్రారంభమైందని అమిత్ షా తెలిపారు. 2024 జనవరి 1న రామమందిరం ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. 


2024 లో సాధారణ ఎన్నికలున్నాయి. రామ మందిరం ప్రారంభం కూడా అదే ఏడాది ఎన్నికలకు కొద్దిగా ముందు జరగనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో తాను బీజేపీ అధ్యక్షుడిగా, రాహుల్ గాందీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నానని అమిత్ షా చెప్పారు. రామమందిరాన్ని నిర్మిస్తానంటారు కానీ ఎప్పుడనేది చెప్పరని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తుంటారని అమిత్ షా చెప్పారు. 2024 జనవరి 1 కి అయోధ్యలో ఆకాశాన్ని తాకే రామమందిరం సిద్ధంగా ఉంటుందని రాహుల్ గాంధీ తెలుసుకోవాలన్నారు. కేవలం రామమందిరమే కాదు..1-2 ఏళ్లలో త్రిపుర సుందరి దేవి మందిరం కూడా నిర్మిస్తామని..మొత్తం ప్రపంచం చూస్తుందని స్పష్టం చేశారు.


Also read: CM KCR: సీఎం కేసీఆర్‌కు సర్ ఛోటురామ్ అవార్డు.. ఎందుకంటే..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook