List of Bank holidays in January | జనవరి 2021లో బ్యాంకులు 16 రోజులపాటు మూసివేసే అవకాశం ఉంది. వీటిలో నాలుగు ఆదివారాలతో పాటు 2వ శనివారం, 4వ శనివారం ఉన్నాయి. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు దినం కానుంది. రిపబ్లిక్ డే నేషనల్ హాలిడే కావడంతో ఆరోజున అన్ని బ్యాంకులకు సెలవు వర్తిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) చెన్నై, ఐజాల్, గ్యాంగ్‌టాక్, ఇంఫాల్, షిల్లాంగ్‌లలో బ్యాంక్ సెలవు ప్రకటించింది. 
నూతన సంవత్సర వేడుకల కోసం ఐజాల్‌కు జనవరి 2న మరో సెలవు లభిస్తుంది. జనవరి 12 న స్వామి వివేకానంద పుట్టినరోజు సందర్భంగా కోల్‌కతాలో బ్యాంకులకు సెలవు లభించింది.


జనవరి 14న మకర సంక్రాంతి పండుగ సందర్భంగా, అహ్మదాబాద్, గాంగ్టక్, హైదరాబాద్‌లలో బ్యాంకులకు సెలవు వర్తిస్తుంది. సంక్రాంతి పండగ ( Sankranti festival ) కారణంగా దక్షిణాది రాష్ట్రాలతోపాటు లోడి పేరిట సంక్రాంతిని జరుపుకునే పంజాబ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లోనూ జనవరి 14 నుంచి 17 వరకు మూడు రోజులపాటు బ్యాంకులు మూసే ఉండనున్నాయి. తిరువల్లూవర్ దినోత్సవం, మాగ్ బిహు, తుసు పూజల వేడుకల కోసం జనవరి 15 న హైదరాబాద్‌లో బ్యాంకులు మూసే ఉంటాయి.


Also read : Money making tips: మీకు 2 Bank accounts ఉన్నాయా ? వెంటనే ఇలా చేయండి.. లేదంటే మీ జేబుకు చిల్లు ఖాయం


జనవరి 20న గురు గోవింద్ సింగ్ జీ పుట్టినరోజు చండీఘడ్‌లో బ్యాంకులకు సెలవు వర్తిస్తుంది.


25 జనవరి 2021న, ఇమోనాల్ ఇరాట్పా కారణంగా ఇంఫాల్‌లో మాత్రమే బ్యాంక్ సెలవుదినాన్ని పాటిస్తారు.


రిపబ్లిక్ డే రోజున దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు దినం కానుంది.


జనవరి 2021లో జాతీయ బ్యాంకు సెలవుల జాబితా ఇలా ఉంది.


1 జనవరి 2021- నూతన సంవత్సర దినోత్సవం


2 జనవరి 2021 -కొత్త సంవత్సరం వేడుక


3 జనవరి 2021- ఆదివారం


9 జనవరి 2021- రెండవ శనివారం


10 జనవరి 2021- సండే వీక్లీ ఆఫ్


12 జనవరి 2021 - స్వామి వివేకానంద జన్మదినం


14 జనవరి 2021 - మకర సంక్రాంతి / పొంగల్ / మాఘే సంక్రాంతి


15 జనవరి 2021 - తిరువల్లూవర్ డే / మాగ్ బిహు, తుసు పూజ


16 జనవరి 2021 - ఉజవర్ తిరునాల్


17 జనవరి 2021- ఆదివారం సెలవు


20 జనవరి 2021 - గురు గోవింద్ సింగ్ జీ పుట్టినరోజు


23 జనవరి 2021- నేతాజీ సుభాస్ చంద్రబోస్ పుట్టినరోజు, 4వ శనివారం


24 జనవరి 2021- ఆదివారం


25 జనవరి 2021-ఇమోయిను ఇరత్పా


26 జనవరి 2021- గణతంత్ర దినోత్సవం


31 జనవరి 2021- ఆదివారం


Also read :  SBI alert: ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు హెచ్చరిక.. అప్రమత్తం కాకుంటే అంతే సంగతి!


2021 సంవత్సరానికి బ్యాంకులకు ఏడాది పొడవునా 40 రోజులకు పైగా సెలవులు ఉండనున్నట్టు ( Banks holidays in 2021 ) ఆర్బిఐ తెలిపింది. సెలవు దినాల్లో బ్యాంకులు మూసివేసినా.. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ( Net Banking ) సేవలు యధావిధిగా అందుబాటులో ఉండనున్నాయి.


Also read : Best savings schemes: నెలకు రూ.10 వేలు పొదుపు చేయండి.. 16 లక్షలకుపైనే పొందండి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook