Best savings schemes: నెలకు రూ.10 వేలు పొదుపు చేయండి.. 16 లక్షలకుపైనే పొందండి..

పోస్ట్ ఆఫీసులో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అనేది సేఫ్ సేవింగ్స్ స్కీమ్స్‌లో ఒకటి. చిన్నమొత్తాల దీర్ఘకాలిక పొదుపు పథకాలలో ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్స్ ముందుంటాయి.

  • Nov 30, 2020, 18:23 PM IST

నెలకు కనీసం రూ.100 నుంచి గరిష్టంగా ఎంత మొత్తమైనా పొదుపు చేసుకునేందుకు ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్స్ వీలు కల్పిస్తాయి. ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్స్ కింద ఆర్డీ ఎకౌంట్ ని ఒక్కరైనా ప్రారంభించవచ్చు లేదా ఇద్దరు, ముగ్గురు కలిసి అయినా ఈ పొదుపు ఖాతాను తెరవవచ్చు.

1 /9

పదేళ్లు నిండిన చిన్నారుల పేర్లపైన కూడా ఈ ఖాతాను తెరవొచ్చు. అయితే సంరక్షకుడి పర్యవేక్షణలో ఇది జరగాల్సి ఉంటుంది. 

2 /9

ఒక రికరింగ్ డిపాజిట్ మెచ్యురిటీ పీరియడ్ కనీసం 5 ఏళ్లు ఉంటుంది. ఆ తర్వాత కూడా ఈ పొదుపు ఖాతాను కొనసాగించాలి అనుకుంటే.. ఖాతా గడువు ముగియకముందే పోస్ట్ ఆఫీస్ సిబ్బందికి చెప్పి అదే ఖాతాను మరో ఐదేళ్ల వరకు కొనసాగించవచ్చు.

3 /9

ప్రతీ మూడు నెలలకు ఒకసారి రికరింగ్ డిపాజిట్ పొదుపు మొత్తంపై ఎప్పటికప్పుడు అమలులో ఉన్న వడ్డీ రేటు ప్రకారం వడ్డీ లెక్క చూస్తారు.

4 /9

పదేళ్లపాటు నెలకు రూ. 10 వేలు చొప్పున జమ చేస్తే.. మెచ్యురిటీ కాలం పూర్తయిన తర్వాత అసలు, వడ్డీ కలిపి రూ.16.28 లక్షల మొత్తం వస్తుంది.

5 /9

అయితే, సకాలంలో ఆర్డీ పొదుపు మొత్తాన్ని చెల్లించనట్టయితే.. ప్రతి నెలా చెల్లించే రికరింగ్ డిపాజిట్‌లో 1 శాతం మొత్తాన్ని జరిమానా కింద చెల్లించాల్సి ఉంటుంది.

6 /9

అలా నాలుగు నెలల పాటు రికరింగ్ డిపాజిట్‌ చెల్లించనట్టయితే, ఆ ఖాతాను స్థంభింపచేస్తారు. మరో 2 నెలల తర్వాతే ఆ ఖాతా తిరిగి అందుబాటులోకి వస్తుంది.

7 /9

ప్రస్తుతం అమలులో ఉన్న వడ్డీ రేటు ప్రకారం రికరింగ్ డిపాజిట్ పొదుపు మొత్తాలపై పోస్టల్ విభాగం 5.8 శాతం వడ్డీ చెల్లిస్తోంది. జులై 1 నుంచి ఈ వడ్డీ రేట్లు అమలవుతున్నాయి.

8 /9

ఏడాది పాటు రికరింగ్ డిపాజిట్స్ చెల్లించిన తర్వాత ఖాతాదారులు పొదుపు చేసుకున్న మొత్తంలో 50 శాతం.. అంటే సగం మొత్తం వరకు రుణం కింద తిరిగి తీసుకోవచ్చు. రుణం కింద తీసుకున్న మొత్తాన్ని తిరిగి వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది.

9 /9

రూ.100 నుంచి రికరింగ్ డిపాజిట్ పథకాలు ప్రారంభం అవుతుండటంతో ఎవరి ఆర్థిక పరిస్థితులకు తగినట్టు వారు తమకు అనువయ్యే మొత్తాన్ని పొదుపు చేయొచ్చు.