పారాహుషార్.. ఈ వారంలో బ్యాంకులకు మూడు రోజులు సెలవులు..!
ఈ వారంలో బ్యాంకులకు మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. కనుక బ్యాంకుకు వెళ్లి డిపాజిట్లు, విత్ డ్రాలు చేసే వినియోగదారులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
ఈ వారంలో బ్యాంకులకు మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. కనుక బ్యాంకుకు వెళ్లి డిపాజిట్లు, విత్ డ్రాలు చేసే వినియోగదారులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ మూడు రోజులలో కాకుండా ప్రత్యమ్నాయ తేదీల్లో బ్యాంకులతో ఏవైనా తమ ఆర్థిక లావాదేవీలు ఉంటే చేసుకోవడం మంచిది. ముఖ్యంగా డిపాజిట్లు చేసేవారు కూడా ప్లానింగ్ ప్రకారం చేసుకోవడం బెటర్. ఎందుకంటే.. నవంబరు 21 తేదిన మిలాద్ ఉన్ నబీ కాబట్టి అది భారతీయ బ్యాంకులకు అధికారిక సెలవే. అలాగే.. నవంబరు 23వ తేదిన గురు నానక్ జయంతి కాబట్టి.. ఆ రోజు కూడా బ్యాంకులు పనిచేయవు.
ఇక నవంబరు 24 (శనివారం).. నాలుగో శనివారం కాబట్టి దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకూ ఆ రోజు సెలవుదినమే. కాకపోతే.. సంతోషించాల్సిన విషయం ఏమిటంటే... నవంబరు 23, 24 తేదిలు మాత్రమే వరుస సెలవులు. అలాగే 21 తేదికి, 23 తేదికి మధ్య 22వ తేదీ ఖాళీగా ఉంది. ఆ రోజు బ్యాంకులు పనిచేస్తాయి. ఈ సెలవులు అన్ని ప్రధాన బ్యాంకులకు వర్తిస్తాయని చెప్పుకోవచ్చు.
ఇక కర్ణాటకలో పరిస్థితి వేరు. మనకు మూడు రోజులు బ్యాంకులు సెలవులు అయితే... ఆ రాష్ట్రంలో ఈ నెల 26వ తేది కూడా సెలవే. కన్నడ కవీంద్రుడు కనకదాస్ జయంతి సందర్భంగా ఆ రోజు ఆ రాష్ట్రంలో సెలవు కాబట్టి.. ఆ రోజు అక్కడ బ్యాంకులు పనిచేయవు.