Bank Holidays: బ్యాంకులకు ఈ మూడు రోజులు సెలవు, ఎప్పుడెప్పుడంటే
Bank Holidays: ఏదైనా పని కోసం బ్యాంకుకు వెళ్లే ఆలోచన ఉంటే ఒకసారి బ్యాంకు సెలవుల జాబితా చెక్ చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే ఈసారి దీపావళి సెలవులున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Bank Holidays: ప్రస్తుత ఆధునిక టెక్నాలజీలో బ్యాంకు సంబంధిత పనులు అన్నీ ఆన్‌లైన్ విధానంలో జరిగిపోతున్నాయి. ఆన్‌లైన్ చెల్లింపులు అధికమౌతున్నాయి. యూపీఐ చెల్లింపులు వచ్చిన తరువాత బ్యాంకులకు వెళ్లడమే కష్టమైపోయింది. అయితే ఇప్పటికీ కొన్ని పనుల కోసం బ్యాంకులకు వెళ్లక తప్పని పరిస్థితి. అందుకే ఆర్బీఐ ప్రతి నెలా బ్యాంకు సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది.
అయితే ఈసారి ఈ అక్టోబర్ నెలాఖరు సెలవుల విషయంలో కాస్త సందిగ్దత ఏర్పడింది. దీపావళి తేదీల విషయంలో ఏర్పడిన కన్ఫ్యూజన్ ఇందుకు కారణం. అందుకే బ్యాంకులకు దీపావళి సెలవులు ఎప్పుడున్నాయనేది చాలామందికి తెలియకుండా ఉంది. అందుకే బ్యాంకులకు వెళ్లే పనుంటే ఆర్బీఐ జారీ చేసిన అక్టోబర్, నవంబర్ సెలవుల జాబితా వెరిఫై చేసుకోవాలి. కొంతమంది దీపావళిని అక్టోబర్ 31న జరుపుకుంటుంటే, మరి కొంతమంది నవంబర్ 1న జరుపుకోనున్నారు. మరి బ్యాంకులకు సెలవు ఎప్పుడనేది ఇప్పుడు చూద్దాం. దీపావళి ఫెస్టివ్ వీక్ అనేది అక్టోబర్ 28 ఇవాళ ప్రారంభమౌతుంది. ఈసారి దీపావళి రెండ్రోజులు జరుపుకుంటున్నారు. అక్టోబర్ 31, నవంబర్ 1 తేదీల్లో ఉంది.
ప్రజలకు ఇప్పటికే దీపావళి పండుగ ఎప్పుడు, బ్యాంకు సెలవు ఎప్పుడనే విషయంలో సందిగ్దత ఉంది. బ్యాంకు సెలవు ఎప్పుడో తెలియకుండా బ్యాంకుకు వెళితే ఇబ్బంది ఎదుర్కోవల్సి వస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం దీపావళి అక్టోబర్ 31న ఉంది. ఆ రోజు అమావాస్య మద్యాహ్నం 3.12 గంటలకు ప్రారంభమై నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5.53 గంటల వరకూ ఉంటుంది. దాంతో లక్ష్మీ పూజ నిర్వహించరు. అందుకే కొందరు అక్టోబర్ 31నే దీపావళి జరుపుకుంటారు.
అంటే ఇప్పుడు ఆర్బీఐ ఇచ్చిన సెలవుల జాబితా ప్రకారం అక్టోబర్ 31, నవంబర్ 1, నవంబర్ 2 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. ఈ మూడు రోజులు దేశంలోని చాలా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవులున్నాయి. అందుకే ఈ మూడు రోజులు బ్యాంకు పనులుంటే వాయిదా వేసుకోవడం మంచిది. దేశవ్యాప్తంగా దాదాపు చాలా రాష్ట్రాల్లో అక్టోబర్ 31, నవంబర్ 1, 2 తేదీల్లో బ్యాంకులకు మూడు రోజులు సెలవులున్నాయి.
Also read: New Pension Rule: పెన్షనర్లకు దీపావళి గిఫ్ట్, ఇక ప్రతి నెలా అదనపు పెన్షన్, కొత్త నిబంధనలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.