Basavaraj Bommai: కర్ణాటకకు కొత్త సీఎం బసవరాజ్ బొమ్మై
Karnataka new CM Basavaraj Bommai: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ఎన్నికైన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం జరిగిన బీజేపి లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో బీజేపి ఎమ్మెల్యేలు బసవరాజ్ బొమ్మైను తమ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. జనతాదళ్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బసవరాజు బొమ్మై బీజేపి (BJP) అధిష్టానం ఆహ్వానంతో 2008లో బీజేపీలో చేరారు.
Karnataka new CM Basavaraj Bommai: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై ఎన్నికైన సంగతి తెలిసిందే. మంగళవారం సాయంత్రం జరిగిన బీజేపి లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో బీజేపి ఎమ్మెల్యేలు బసవరాజ్ బొమ్మైను తమ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. జనతాదళ్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన బసవరాజు బొమ్మై బీజేపి (BJP) అధిష్టానం ఆహ్వానంతో 2008లో బీజేపీలో చేరారు. 1998, 2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయిన బసవరాజు షిగ్గావ్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
బిఎస్ యడియూరప్ప తరహాలోనే బసవరాజ్ బొమ్మై కూడా అదే లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతగా పేరు తెచ్చుకున్నారు. బసవరాజ్ బొమ్మై తండ్రి ఎస్ఆర్ బొమ్మై కూడా గతంలో కర్ణాటక ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. యడియూరప్పకు అనుకూలమైన వ్యక్తిగా పేరున్న బసవరాజ్ బొమ్మై ప్రస్తుత కేబినెట్‌లో హోంమంత్రిగా ఉన్నారు. తనకు అనుకూలమైన వ్యక్తి కావడంతో యడియూరప్ప (BS Yediyurappa) సైతం బసవరాజ్ పేరునే ముఖ్యమంత్రిగా పరిశీలించాల్సిందిగా అధిష్టానానికి సూచించారు.
Also read : Karnataka: రాజీనామాకు ముందు డీఏ భారీగా పెంచిన యడ్యూరప్ప
అదే సమయంలో బీజేపి ఎమ్మెల్యేలు కూడా బసవరాజ్‌కే ఓటేయడంతో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా (Basavaraj Bommai) ఆయన ఎన్నిక ప్రక్రియ పూర్తయింది.
Also read : Karnataka politics: కర్ణాటక కొత్త సీఎం ఎంపిక కోసం పరిశీలకుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook