Jayalalitha Case: 1996లో అక్రమ సంపాదన కేసులో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల కేసు ఇది. కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఈ ఆభరణాల కేసుకు సుదీర్ఘకాలం తరువాత తెరపడింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత అక్రమార్జన కేసులో 1996లో చెన్నైలోని ఆమె నివాసం నుంచి పెద్దఎత్తున బంగారు ఆభరణాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆభరణాలు అప్పట్నించి కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. ఈ కేసులో జయలలితకు 2014లో బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష, 100 కోట్ల జరిమానా విధించింది. ఆమె ఇంట్లో స్వాధీనం చేసుకున్న వస్తువుల్ని ఆర్బీఐ, ఎస్బీఐ లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని స్పష్టం చేసింది. ఇంతలో జయలలిత అనారోగ్యానికి గురై మరణించారు. ఈ కేసుపై మరోసారి విచారణ జరిపిన బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశించింది. 


ఈ ఆభరణాల్లో  7,040 గ్రాముల బంగారు ఆభరణాలు, వజ్రాభరణాలు, 700 కిలోల వెండి వస్తువులు, 740 ఖరీదైన చెప్పులు ఉన్నాయి. ఇవి కాకుండా 11,344 పట్టు చీరలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేట్లు, 10 టీవీ సెట్లు, 8 వీసీఆర్ లు, 1 వీడియో కెమేరా, 4 సిడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్‌లు, 24 టూ ఇన్ వన్ టేప్ రికార్డర్లు, 1040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్ లాకర్లు, 1,93,202 రూపాయల నగదగు ఉంది. ఈ ఆభరణాలను తీసుకెళ్లేందుకు ఆరు ట్రంకు పెట్టెలు తెచ్చుకోవాలని కోర్టు సూచించింది. మార్చ్ 6, 7 తేదీల్లో వీడియో గ్రాఫర్లు, ఫోటో గ్రాఫర్ల, ఇతర భద్రతా సిబ్బంది సమక్షంలో అన్ని ఆభరణాలు తీసుకెళ్లాల్సిందిగా బెంగళూరులోని 36వ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. ఆభరణాలు తీసుకెళ్లేందుకు ఓ అధికారిని నియమించారు. తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ కలిసి ఆ అధికారితో సమన్వయం చేసుకోవాలని కోర్టు సూచించింది. 


జయలలిత నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన పదేళ్ల తరువాత ఈ కేసుపై కోర్టు నిర్ణయం తీసుకుంది. ఇక జయలలిత చరాస్థులు, స్థిరాస్థులు వేలం వేయాల్సి ఉంది. కోర్టు విధించిన 100 కోట్ల జరిమానాను 20 కిలోల నగలు అమ్మడం ద్వారా వసూలు చేస్తారు. ఇందులో 7 కిలోల నగలు తల్లి నుంచి వారసత్వంగా వచ్చినవిగా భావించి మినహాయిస్తారు. 


Also read: Best EV Scooters: ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం చూస్తున్నారా, 70 వేలకే లభిస్తున్న టాప్ 9 ఈవీ స్కూటీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook