Best Electric Scooters in India: ప్రస్తుతం యూత్‌లో బైక్స్ కంటే స్కూటర్లకు ఎక్కువ డిమాండ్ కన్పిస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనే ఆలోచన ఉన్నా ధర ఎక్కువనే కారణంతో ఆగిపోతున్నారు. ఎందుకంటే మార్కెట్‌లో లభించే చాలా కంపెనీ ఈవీ స్కూటర్ల ధరలు 1 లక్ష నుంచి 2 లక్షల వరకూ ఉన్నాయి. అయితే మీకు అనువైన బడ్జెట్‌లో కేవలం 70 వేలలోపు దర కలిగిన టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏమున్నాయో తెలుసుకుందాం.
Benling Falcon EV Scooterకు మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. లోకల్‌గా తిరిగేందుకు బాగుంటుంది. ఫుల్‌ఛార్జ్ చేస్తే 75 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తుంది. 3 రంగుల్లో లభ్యమయ్యే ఈ స్కూటీ ధర కేవలం 60,923 రూపాయలు మాత్రమే.
Techo Electra Emerge EV Scooter కూడా చాలా తక్కువ దరకే లభిస్తోంది. ఈ స్కూటీ ధర కేవలం 68,286 రూపాయలు. ఫుల్‌ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్లు వెళ్తుంది. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. ఇది కూడా మూడు రంగుల్లో అందుబాటులో ఉంది.
Komaki XGT XOne EV Scooty మార్కెట్‌లో అతి తక్కువ ధరకు అందుబాటులో ఉన్న ఈవీ స్కూటీ. ధర 47 వేల నుంచి 78 వేల మధ్యలో ఉంది. బ్యాటరీ సామర్ధ్యాన్ని బట్టి ధర మారుతుంది. ఫుల్‌ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 5 రంగుల్లో దొరుకుతోంది.
Yo Drift EV Scooty ధర కూడా చాలా తక్కువ. కేవలం 51 వేలకే లభిస్తుంది. పుల్‌ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 5 రకాల కలర్ ఆప్షన్స్ ఉన్నాయి.
IVoomi S1 EV Scooty ధర కొద్దిగా ఎక్కువే. 70 వేల నుంచి 1 లక్ష 21 వేలవరకూ ఉంటుంది. గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. పుల్‌ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
Okinawa R30 EV Scooty ధర 61 వేలు. గంటకు కేవలం 25 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలిగే ఈ స్కూటీ ఫుల్‌ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఐదు అందమైన రంగుల్లో లభిస్తోంది.
Lectrix SX 25 Ev Scooty మార్కెట్‌లో లభించే ఎలక్ట్రిక్ స్కూటిల్లో ఎక్కువగా కన్పించే బ్రాండ్ ఇది. ఫుల్‌ఛార్జ్ చేస్తే 60 కిలోమీటర్ల దూరం వెళ్తుంది. 4 రంగుల్లో లబించే ఈ స్కూటీ ధర 54 వేల నుంచి 72 వేల మధ్యలో ఉంటుంది.
Evolet Pony EV Scooty ధర కేవలం 55 వేల 799 రూపాయలు మాత్రమే. గంటకు 25 కిలోమీటర్ల గరిష్టవేగంతో వెళ్లగలిగే ఈ స్కూటీ ఫుల్‌ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
Hero Electric Flash Ev Scooty మార్కెట్‌లో బడ్జెట్ రేంజ్‌లో లభించే స్కూటీల్లో బ్రాండెడ్ ఇది. పుల్‌ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
Also read: RK U Turn: మళ్లీ సొంతగూటికి చేరనున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి, అసలేం జరిగింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook