Bengaluru Woman 270 Times Traffic Violation  Goes viral: ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు నిరంతరం ప్రజల్లో అవగాహన కల్పిస్తుంటాయి. అయిన కూడా కొందరుపోలీసులు సూచనలను బేఖాతరు చేస్తుంటారు. సీటు బెల్టుపెట్టుకోకుండా కార్లును నడిపించడం, రాంగ్ రూట్ లోకి చొచ్చుకుని వెళ్లడం చేస్తుంటారు. మరికొందరు సిగ్నల్స్ లను బ్రేక్ చేస్తుంటారు. అంతేకాకుండా.. తప్పతాగి వాహనాలను నడిపిస్తుంటారు. ఇలాంటి ఘటనలలో ముఖ్యంగా వారు ప్రమాదంలో పడటమే కాకుండా.. తమ చుట్టుపక్కల వారిని కూడా డెంజర్ లో పడేస్తుంటారు. రద్దీగా ఉన్న ప్రదేశాలలోరూడ్ గా వాహనాలు నడిపిస్తుంటారు. సరిగ్గ వాహనం నడిపించడం ప్రాక్టిస్ లేకున్న కూడా రోడ్డుమీదకు వచ్చేస్తుంటారు. ఇలాంటి సందర్భలలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. తమ దారిన తాము పోతున్న కూడా ఇలాంటి వారు ప్రమాదాలు చేస్తుంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?
ఇక మరోవైపు టూవీలర్ వాహనాలు కూడా కొందరు ట్రిబుల్ రైడింగ్ లు చేస్తుంటారు. హెల్మెట్ లను అస్సలు పెట్టుకోరు. సిగ్నల్ వద్ద, వాహనాలను తప్పించుకుని వెళ్లిపోతుంటారు. రాంగ్ రూట్ లలో ప్రయాణిస్తుంటారు.  పోలీసులు చాలానాలువేసిన కూడా కొందరు తప్పుడు అడ్రస్ లు ఆన్ లైన్ లో పెడుతుంటారు. అంతేకాకుండా.. పోలీసులకు దొరక్కుండా నంబర్ ప్లేట్లను కూడా మార్చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ లునిర్వహిస్తుంటారు. ఇలాంటి సమయంలో ట్రాఫిక్ రూల్స్ చలానాలు ఉన్న వారు అడ్డంగా దొరికిపోతుంటారు. ఇలాంటి కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు.. 


బెంగళూరు కు చెందిన ఒక మహిళ కొన్ని రోజులుగా  ట్రాఫిక్ రూల్స్ ను కంప్లీట్ గా వయోలెట్ చేస్తుంది. ఇలా దాదాపు.. 270 సార్లు ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించడం వల్ల పోలీసులు ఆమె వాహానంకు ఫైన్ కూడా విధించారు. దీనిలో ముఖ్యంగా.. హెల్మెట్ లేకపోవడం, ట్రిబుల్ రైడింగ్ , సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్ లోకి రావడం, జీబ్రాక్రాసింగ్ దాటి ముందుకు వెళ్లడం వంటి అనేక ఉల్లంఘనలకు సదరు మహిళ పాల్పడినట్లు గుర్తించారు. దీంతో ఆమెకు 270 సార్లు ఉల్లంఘనలకు గాను .. పలుమార్లు ఆమెకు ట్రాఫిక్ పోలీసులు నోటీసులు కూడా పంపారు. కానీ ఆమె మాత్రం స్పందించలేదు.


Read More: Sai Pallavi Dance: షీలా.. షీలా కి జవానీ పాటకు మెస్మరైజింగ్ స్టెప్పులు వేసిన సాయి పల్లవి.. వీడియో వైరల్..


ఈక్రమంలో ఆమె యాక్టివా టూవీలర్ పై చాలన్ లు.. దాదాపు.. 1. 36 లక్షలకు చేరుకుంది. ఈ జరిమాన ఆమె యాక్టివ్ టూవీలర్ ధరకు డబుల్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ పోలీసులు ఎన్నోసార్లు ఆమెకు నోటీసులిచ్చిన స్పందించకపోవడం, ట్రాఫిక్ జరిమానను ఎప్పటికప్పడు క్లియర్ చేయక పోవడం వల్ల.. ఇప్పుడు ఇంత జరిమాన కట్టాలని ట్రాఫిక్ పోలీసులకు ఆమెకు నోటీసులు జారీ చేశారంట. ప్రస్తుతం ఆమె యాక్టివా  టూవీలర్ ను పోలీసులు స్వాధినం చేసుకున్నారంట. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook