Bengaluru woman Assulted on morning walk incident: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రత కోసం ఎన్నిచట్టాలు తీసుకొచ్చిన కామాంధులు మాత్రం మారండంలేదు. ప్రతిరోజు మహిళలకు వేధింపులు మాత్రం ఆగడంలేదు. గుడి, బడి, బస్టాండ్, మెట్రోలు.. ప్రతి చోట మహిళలు వేధింపులకు గురౌతున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారు సైతం.. వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో.. కొన్ని చోట్ల కన్న వారు, తోడ బుట్టిన వారు సైతం అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కామాంధులు పసిపాప నుంచి పండు ముసలి వరకు ఎవర్ని వదలడంలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



చివరకు అన్యాయం జరిగిందని పోలీసు స్టేషన్ కు వెళితే అక్కడ కూడా దారుణాలు జరుగుతున్నాయి. కొందరు పోలీసులు బాధితులు మీదనే వేధింపులు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. దీంతో మహిళలు ఇంటి నుంచి బైటకు వెళ్లిన వారు..తిరిగి వచ్చే వరకు కూడా ఎంతో టెన్షన్ గా మారిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం.. దేశంలో ప్రతి రోజు పదుల సంఖ్యలో అత్యాచారాలు, హత్యలు జరుగున్నట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో మహిళల వేధింపులకు చెందిన ఘటనలు తరచుగా వార్తలలో ఉంటాయి. తమను ప్రేమించలేదని, ఇతరుల్ని ఇష్టపడ్డారని కొంత మంది వేధిస్తుంటారు. మరికోందరు రోడ్డుపైన వెళ్తున్న మహిళలను అత్యాచారాలకు  ప్రయత్నిస్తుంటారు. ఈ కోవకు చెందిన  ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


పూర్తి వివరాలు..



సిలికా సిటీ బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరులో శుక్రవారం మార్నింగ్ వాక్‌కు వెళ్లింది. తన ఫ్రెండ్ కోసం వేచిచూస్తుంది. ఇంతలో ఒక కామాంధుడు ఆమెను ఫాలో అయ్యాడు. వెంటపడి నోరు మూసేందుకు ప్రయత్నించాడు. ఆమెను గట్టిగా హత్తుకుని, అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో సదరు మహిళ అక్కడి నుంచి తప్పించుకుని, కేకలు వస్తూ అక్కడి నుంచి పారిపోయింది.


Read more: Bangladesh: షేక్ హసీనా ఎవరు?.. గ్రనేడ్  దాడుల నుంచి బైటపడ్డ అవామీ లీగ్ సివంగీ గురించి ఈ విషయాలు తెలుసా..?


దుండగుడు ఆమెను ఫాలో అయ్యాడు. కొందరు అక్కడికి చేరుకుంటుండగా.. అతను పారిపోయడు.  తెల్లవారుజామున 5 గంటలకు జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం  ఈ ఘటన మాత్రం సంచలనంగా మారింది. బెంగళూరు సౌత్ పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter