Bharat Bandh Latest News: భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు
Bharat Bandh Latest News Updates: నూతన వ్యవసాయ చట్టాలతో తమకు నష్టం జరుగుతుందని, వాటిని రద్దు చేయాలని రైతులు కోరగా ప్రభుత్వం అందుకు హామీ ఇవ్వలేదు. దీంతో రైతులు చేపట్టిన ఆందోళన తీవ్రతరం అయింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 8న భారత్ బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల ఆందోళనకు కారణమయ్యాయి. నూతన వ్యవసాయ చట్టాలతో తమకు నష్టం జరుగుతుందని, వాటిని రద్దు చేయాలని రైతులు కోరగా ప్రభుత్వం అందుకు హామీ ఇవ్వలేదు. దీంతో రైతులు చేపట్టిన ఆందోళన తీవ్రతరం అయింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 8న భారత్ బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.
రైతు సంఘాల నాయకుడు హర్వీదర్ సింగ్ లడ్క్‌వాల్ భారత్ బంద్‌కు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరగా ప్రభుత్వం నుంచి తమకు సానుకూల స్పందన రాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో తొలుత డిసెంబర్ 5వ తేదీన దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ లోఖోవాల్ జనరల్ సెక్రటరీ హర్వీదర్ సింగ్ తెలిపారు. తమ డిమాండ్లకు దిగొచ్చి వ్యవసాయ బిల్లును కేంద్రం దిగిరాకపోతే డిసెంబర్ 8వ తేదీన భారత్ బంద్ పాటించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
Also Read : GHMC Election Results 2020 Live Updates: టీఆర్ఎస్ ఎమ్మెల్యే భార్య ఓటమి
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన ఆందోళన నేటితో తొమ్మిదో రోజుకు చేరింది. అయితే కోవిడ్19 త్వరగా వ్యాప్తి చెందుతుందని, నిరసన తెలుపుతున్న రైతులను త్వరగా ఖాళీ చేయించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని, తమ డిమాండ్లను అంగీకరించాలని రైతులు పట్టు వీడటం లేదు. ఈ నేపథ్యంలో భారత్ బంద్‌కు సైతం రైతు సంఘాలు పిలుపునిచ్చాయి.
Also Read : GHMC Exit Polls 2020: ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయంటే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe