GHMC Exit Polls 2020: ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయంటే!

  • Dec 03, 2020, 19:33 PM IST

ఎట్టకేలకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GHMC Elections 2020) పూర్తయ్యాయి. ఓల్డ్ మలక్‌పేటలో డిసెంబర్ 1వ తేదీన వాయిదా పడిన పోలింగ్ ప్రక్రియ గురువారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. దీంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు 2020 ఎగ్జిట్ పోల్స్ (GHMC Exit Polls 2020) వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన ఆరా సంస్థ పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయన్నది తెలిపింది. ఆ వివరాలిలా ఉన్నాయి..

1 /5

2 /5

ఆరా సంస్థ టీఆర్ఎస్‌ (TRS)కు మెజార్టీ స్థానాలు వస్తాయని వెల్లడించింది. టీఆర్ఎస్ పార్టీ 71 నుంచి 85 సీట్లు కైవసం చేసుకోనుంది. గులాబీ పార్టీ 40.08 శాతం శాతం ఓట్లు సాధించింది

3 /5

GHMC Elections 2020లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేసిన బీజేపీకి 23 నుంచి 33 స్థానాలు వస్తాయని చెప్పింది. అయితే టీఆర్ఎస్ తర్వాత అత్యధికంగా 31.21 శాతం ఓట్లును కమలదళం సాధించడం గమనార్హం.

4 /5

టీఆర్ఎస్ తర్వాత ఏఐఎంఐఎం పార్టీ 36 నుంచి 46 సీట్లు గెలుచుకుంటుందని ఆరా సంస్థ పేర్కొ్ంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి 13.43 శాతం ఓట్లు పోలయ్యాయి.

5 /5

GHMC Electionsలో కాంగ్రెస్‌ పార్టీ మరోసారి విఫలమైనట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ 0-6 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు ఆరా సంస్థ పేర్కొంది. 8.58 శాతం ఓట్లను హస్తం పార్టీ సాధించింది. ఇతరులకు 7.70 శాతం ఓట్లు పోలయ్యాయి. Also Read : Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!