Agnipath Protest: దేశంలో అగ్నిపథ్ ఆందోళనలు ఆగడం లేదు. ఆర్మీ రిక్రూట్ మెంట్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.. అగ్నిపథ్ స్కీమ్ ద్వారానే నియామకాలు చేపడుతామని త్రివిధ దళాలు ప్రకటించాయి. అయినా అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ సోమవారం భారత్ బంద్ కు పలు సంస్థలు పిలుపిచ్చాయి. బీహార్, హర్యానా, పంజాబ్ లో కొన్ని సంస్థలు భారీ నిరసనలకు పిలుపిచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అగ్నిపథ్ కు వ్యతిరేకంగా భారత్ బంద్  కు పిలుపివ్వడంతో కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు భద్రత పెంచింది. సికింద్రాబాద్ తరహా ఘటనలు జరగకుండా రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. రైల్వే స్టేషన్ల దగ్గర రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ను మోహరించారు. గవర్నమెంట్ రైల్వే పోలీసులను రంగంలోకి దింపారు.సమస్యాత్మక ప్రాంతాల్లోని రైల్వే స్టేషన్ల దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అల్లర్లు జరిగే అవకాశాలు ఉన్నాయని గుర్తించిన బీహార్‌లోని 20 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించారు. పంజాబ్‌లోని సైనిక స్థావరాలు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులపై దాడులు, అల్లర్లకు పాల్పడే వారిని అరెస్టు చేసి కఠిన సెక్షన్ల కింద కేసులు పెడతామని కేరళ పోలీసులు హెచ్చరించారు. హర్యానాలో గతంలో అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.


అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ బీహార్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, కేరళ, జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు పలు రైళ్లకు నిప్పుపెట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి దిగిన నిరసనకారులపై కాల్పులు కూడా జరిపారు. పోలీసు కాల్పుల్లో ఒక యువకుడు చనిపోయాడు.  సికింద్రాబాద్ ఘటన తర్వాత కేంద్ర సర్కార్ మరింత అప్రమత్తమైంది. అగ్నిపథ్ పై ముందుకు వెళ్లాలని డిసైడైంది. నిరసనకారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే ఇకపై ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హులు కారని ఆర్మీ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. భారత్ బంద్ నేపథ్యంలో పోలీసులు, ఆర్పీఎఫ్, జీఆర్పీలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.నిరసనకారులను హెచ్చరిస్తూ RPF సీనియర్ అధికారులు కీలక  ప్రకటన చేశారు. అల్లర్లు, విధ్వాంసానికి పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని అన్ని యూనిట్లకు ఆదేశాలు జారీ చేశారు. ఐపీసీలోని కఠినమైన సెక్షన్ల కింద ఆందోళనకారులపై యాక్షన్ తీసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఆందోళనకారులను గుర్తించేందుకు డిజిటల్ సాక్ష్యాలను సేకరించాలని ఆదేశించారు. ఎలాంటి హాని జరగకుండా పోలీసు అధికారులు రక్షణ కవచాలను ధరించాలని సూచించారు.


Read also: Agnipath Protests: అగ్నిపథ్ స్కీమ్‌పై దుష్ప్రచారం.. 35 వాట్సాప్ గ్రూపులపై కేంద్రం నిషేధం  


Read also: Pawan Kalyan: పొత్తులపై పవన్ కల్యాణ్ యూ టర్న్! టీడీపీలో పరేషాన్.. అంతా ఆయనవల్లేనా?  


Also read: Cucumber Drink Benefits: దోసకాయల డ్రింక్‌తో ఇలా సులభంగా బరువును తగ్గించుకోండి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook