Centre Bans 35 WhatsApp Groups over Agnipath Protests: త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'అగ్నిపథ్'స్కీమ్‌పై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారనే కారణంతో 35 వాట్సాప్ గ్రూపులపై కేంద్రం నిషేధం విధించింది. ఈ వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసినవారిని, హింసాత్మక సంఘటనలకు ప్రేరేపించినవారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కేంద్రం నిషేధం విధించిన ఈ వాట్సాప్ గ్రూప్ వివరాలు మాత్రం బయటకు వెల్లడికాలేదు.
త్రివిధ దళాల్లో నియామకాల కోసం ఇదివరకు అనుసరించిన విధానాన్ని కాకుండా 'అగ్నిపథ్' అనే కొత్త స్కీమ్‌ను ప్రవేశపెడుతున్నట్లు గత మంగళవారం కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా 17.5-21 ఏళ్ల వయసున్న ఔత్సాహిక అభ్యర్థులను నాలుగేళ్ల కాల పరిమితితో త్రివిధ దళాల్లోకి తీసుకుంటారు. నాలుగేళ్ల సర్వీస్ తర్వాత వీరిలో 25 శాతం మందిని రెగ్యులరైజ్ చేస్తారు. మిగతా 75 శాతం మంది సర్వీస్ నుంచి రిలీవ్ చేసి సేవా నిధి ప్యాకేజీ కింద రూ.12 లక్షల వరకు అందజేస్తారు. దీనిపై ఎలాంటి పన్ను విధించబడదు. అంతేకాదు, సీఏపీఎఫ్, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో వీరికి 10 శాతం రిజర్వేషన్ ఉంటుంది. ఒకవేళ సర్వీస్ నుంచి రిలీవ్ అయ్యాక ఏదైనా వ్యాపారం నిర్వహించాలనకుంటే బ్యాంకుల ద్వారా రుణాలు కూడా అందజేస్తారు.
కొన్నాళ్లైనా దేశానికి సేవ చేయాలనుకునే ఎంతోమంది యువతకు ఈ పథకం ద్వారా అవకాశం చిక్కుతుందని.. మునుపటికన్నా మరింత మందికి త్రివిధ దళాల్లో చేరే అవకాశం లభిస్తుందని కేంద్రం చెబుతోంది. మరోవైపు, ఈ పథకం ద్వారా తమ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని ఆర్మీ అభ్యర్థులు వాపోతున్నారు. నాలుగేళ్ల సర్వీస్ తర్వాత తమ పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా బీహార్, రాజస్తాన్,యూపీ, తెలంగాణ తదితర చోట్ల తీవ్ర నిరసనలు, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ కేంద్రం మాత్రం ఈ పథకంపై వెనక్కి తగ్గలేదు. ఇకపై అగ్నిపథ్ స్కీమ్ ద్వారా త్రివిధ దళాల రిక్రూట్‌మెంట్ ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.
Also Read: Etela Rajender: బీజేపీ ప్రచార కమిటి చైర్మెన్ గా ఈటల? తెలంగాణలో అమిత్ షా జబర్దస్త్ ప్లాన్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook