Bharat Biotech Covaxin: భారత్ బయోటెక్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ మెరుగ్గా పనిచేస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. కోవాగ్జిన్ ఫేజ్ 3 ట్రయల్స్ డేటాను పరిశీలించిన అనంతరం చీఫ్ సైంటిస్ట్ ఈ విషయాన్ని తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్ బయోటెక్ కోవాగ్జిన్ పేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ డేటా జూన్ 23 వరకు సేకరించి, దానిపై సమావేశంలో చర్చించారు. ఓ ప్రముఖ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పలు విషయాలు వెల్లడించారు. కోవాగ్జిన్ కోవిడ్19 వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుంది. కానీ ప్రమాదకర డెల్టా వేరియంట్‌పై కోవాగ్జిన్ ప్రభావం తక్కువగా ఉంటుందని, అయినప్పటికీ ఇతర కరోనా వేరియంట్లపై సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. డబ్ల్యూహెచ్‌వో అనుమతికి కొన్నిరోజుల ముందు ఈ ప్రకటన రావడం భారత్ బయోటెక్‌ (Bharat Biotech)కు ఊరట కలిసొస్తుంది. అత్యవసర వినియోగానికి ఆమోదం పొందిన వ్యాక్సిన్లపై ఎప్పటికప్పుడూ వివరాలు పరిశీలిస్తున్నామని డాక్టర్ సౌమ్య స్వామినాథన్ చెప్పారు.


Also Read: Zika Virus cases: కేరళలో జికా వైరస్.. థర్డ్ వేవ్ రాకముందే మరో వైరస్


ప్రపంచంలో పలు దేశాలలో కరోనా మరణాలు తగ్గాయని చెప్పారు. కరోనా నియంత్రణ, కోవిడ్19 వ్యాక్సిన్ల విషయంలో యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి భారత్ స్ఫూర్తి పొందాలని సైతం సూచించారు. ప్రతి దేశం కరోనా వ్యాక్సినేషన్ (Covaxin 3rd phase trials) ప్రక్రియ వేగవంతం చేయడంపై ఫోకస్ చేయాలని, తద్వారా కరోనాను కట్టడి చేయవచ్చునని అభిప్రాయపడ్డారు. భారత్‌లో మొదటగా గుర్తించిన డెల్టా వేరియంట్ ద్వారా ప్రపంచంలో పలు దేశాలలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందినట్లు పేర్కొన్నారు. ఇతర కరోనా వేరియంట్ల ద్వారా ముగ్గురికి కరోనా వ్యాప్తి చెందితే, డెల్టా వేరియంట్ ద్వారా 6 నుంచి 8 మందికి కోవిడ్19 సోకుతుందన్నారు.


Also Read: Horoscope Today In Telugu: నేటి రాశి ఫలాలు 09 జులై 2021, ఓ రాశివారికి ఉద్యోగావకాశం


కరోనా వైరస్ మరోసారి పరివర్తన చెందితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా వ్యాప్తి చెందుతాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ స్పష్టం చేశారు. ముఖానికి మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, వ్యాక్సిన్లు ఇవ్వడం కరోనాను కట్టడి చేస్తుందన్నారు. కరోనా టెస్టుల సంఖ్య పెంచడంతో పాటు కొత్త వేరియంట్ కేసులు నమోదైన సమయంలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook