Covaxin vs Delta variant: డెల్టా వేరియంట్‌పై కొవాక్సిన్ ప్రభావం 65.2%: Bharat Biotech

Covaxin against Delta plus variant: న్యూ ఢిల్లీ: కొవిడ్-19 వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న వారిలో కొవాక్సిన్ సామర్థ్యం 93.4 శాతంగా ఉందని భారత్ బయోటెక్‌ స్పష్టంచేసింది. కొవాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ భారత్ బయోటెక్ ఈ ప్రకటన చేసింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 3, 2021, 12:19 PM IST
Covaxin vs Delta variant: డెల్టా వేరియంట్‌పై కొవాక్సిన్ ప్రభావం 65.2%: Bharat Biotech

Covaxin against Delta plus variant: న్యూ ఢిల్లీ: కొవిడ్-19 వ్యాధి తీవ్రత అధికంగా ఉన్న వారిలో కొవాక్సిన్ సామర్థ్యం 93.4 శాతంగా ఉందని భారత్ బయోటెక్‌ స్పష్టంచేసింది. కొవాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ భారత్ బయోటెక్ ఈ ప్రకటన చేసింది. కొవిడ్-19 లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిలో 93.4 శాతం, డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం ప్రభావం చూపుతున్నట్టు ఆ సంస్థ ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. 

Also read : COVID-19 Vaccine: డెల్టా వేరియంట్‌పై Johnson and Johnson సింగిల్ డోసు టీకా ప్రభావం, 8 నెలలపాటు సేఫ్

కరోనావైరస్ సంక్రమణ కారణంగా వచ్చే తీవ్ర లక్షణాలను కొవాక్సిన్ (Covaxin against COVID-19) విజయవంతంగా అడ్డుకుంటుందని డాక్టర్ కృష్ణ ఎల్లా వివరించారు. కొవిడ్-19 పై కొవాక్సిన్ సామర్థ్యం గురించి భారత్ బయోటెక్ భాగస్వామి ఆక్యుజెన్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ డా శంకర్ మసునూరి మాట్లాడుతూ.. కొత్త వేరియంట్స్‌పై (New variants) కొవాక్సిన్‌కి ఉన్న సామర్థ్యం ఆ వ్యాక్సిన్ అమెరికా, కెనడా మార్కెట్లలోకి ప్రవేశించేందుకు ఉపయోగపడతాయని అన్నారు.

Also read : Delta Plus Variant: డెల్టా ప్లస్ వేరియంట్‌పై ఆందోళన చెందవద్దు, మరింత సమాచారం వస్తేనే స్పష్టత

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News