Bhiwandi Death Toll: 41కి చేరిన మృతుల సంఖ్య.. సహాయక చర్యలు నిలిపివేసిన ఎన్టీఆర్ఎఫ్
మూడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో మరణాల సంఖ్య (Bhiwandi building collapse Death toll) 41కి చేరుకుంది. మూడు రోజులపాటు కొనసాగించిన సహాయక చర్యలను నాలుగోరోజైన గురువారం నిలిపివేశారు.
భీవండి పట్టణంలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన (Bhiwandi building collapse) ఘటనలో మృతుల సంఖ్య గురువారం ఉదయం నాటికి 41కి చేరింది. నేటి ఉదయం 11.45 సహాయక చర్యలు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం వరకు 33 మంది మరణించారని ఎన్డీఆర్ఎఫ్ (NDRF) సిబ్బంది తెలిపగా.. అనంతరం మరో 8 మృతదేహాలను శిథిలాల కింద నుంచి బయటకు తీశారు. మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండి పట్టణంలో భవనం సోమవారం తెల్లవారుజామున కుప్పకూలడం తెలిసిందే. ఈ ఘటనలో మంగళవారం ఉదయం మరణాల సంఖ్య 20కి చేరగా.. శిథిలాలు తొలగించేకొద్దీ మృతదేహాలు లభ్యమయ్యాయి. Narottam Mishra: మాస్కు ధరించను.. అయితే ఏమైంది?.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం
భవనం యజమానికి మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. సోమవారం నుంచి గురువారం వరకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. దాదాపు 35 మందిని రక్షించినట్లు సమాచారం. కాగా, గాఢనిద్రలో ఉన్న సమయంలో భవనం కుప్పకూలడంతో మృతుల సంఖ్య అధికంగా ఉందని తెలుస్తోంది. భవనం కూప్పకూలిన ఘటనపై దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి ఇదివరకే ఇద్దరు మునిసిపల్ కార్పొరేషన్ అధికారులపై వేటు పడింది. ప్రధాని మోదీ సైతం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ఎప్పటికప్పుడూ వివరాలు కనుక్కున్నారు. Surat Fire Accident: ఓఎన్‌జీసీలో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు
ఫొటో గ్యాలరీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe