PM Modi: ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత అవార్డు...తొలి విదేశీయుడిగా మోదీకి గుర్తింపు..
PM Modi: ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది భూటాన్. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
Bhutan confers highest civilian award on PM Modi: భూటాన్ అత్యున్నత పురస్కారం(Bhutan highest civilian award) ప్రధాని మోదీ(Prime Minister Narendra Modi)ని వరించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాన మంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. భూటాన్ దేశ అత్యున్నత అవార్డు న్గడగ్ పెల్ గి ఖోర్లో(Ngadag Pel gi Khorlo)ను మోదీకి బహుకరించాలని భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నగ్మే వాంగ్‌చుక్ సూచించినట్లు తెలిపింది.
కరోనా సమయంలో మోదీ అందించిన మద్దతుకు గుర్తింపుగా ఈ అవార్డును అందిస్తున్నట్లు ప్రకటించింది భూటాన్ ప్రధాని మంత్రి కార్యాలయం. ఈ అవార్డును 2008లో నెలకొల్పారు. ఈ పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీయుడు ప్రధాని మోదీ. గత నెలలో భూటాన్(Bhutan)లో ఈ-రూపే కార్డు(RuPay card) యొక్క రెండవ దశను మోదీ ప్రారంభించారు. నేడు(డిసెంబరు 17) భూటాన్ దేశ జాతీయ దినోత్సవం. ఈ సందర్భంగా ఈ దేశ అత్యున్నత అవార్డును మోదీకి ప్రకటించడం ఆనందంగా ఉందని భూటాన్ ప్రధాని లోటే షెరింగ్(Lotay Tshering) అన్నారు.
Also Read: Minimum Age For Marriage: అమ్మాయిల కనీస వివాహ వయసు 18 ఏళ్ల నుంచి 21కి పెంపు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి