Minimum Age For Marriage: అమ్మాయిల కనీస వివాహ వయసు 18 ఏళ్ల నుంచి 21కి పెంపు..!

దేశంలో మహిళల కనీస వివాహ వయసు పెంపుపై మరో ముందడుగు పడినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. అమ్మాయిల కనీస వివాహ వయసు (Minimum age of marriage for women) 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. 

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2021, 12:22 PM IST
  • అమ్మాయిల కనీస వివాహ వయసు పెంచే యోచనలో కేంద్రం
  • 18 ఏళ్ల నుంచి 21కి పెంచే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం!
  • త్వరలోనే పార్లమెంట్​ ముందుకు చట్టసవరణ బిల్లు!
Minimum Age For Marriage: అమ్మాయిల కనీస వివాహ వయసు 18 ఏళ్ల నుంచి 21కి పెంపు..!

Minimum Age For Marriage: దేశంలో మహిళల కనీస వివాహ వయసు పెంపుపై మరో ముందడుగు పడినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. అమ్మాయిల కనీస వివాహ వయసు (Minimum age of marriage for women) 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. 

గత ఏడాది ఈ అంశంపై ప్రధాని మోదీ అధికారిక ప్రకటన చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఈ ప్రస్తావన తెచ్చారు. అప్పట్లో ఈ అంశం సమీక్ష దశలో ఉందని చెప్పారు. తాజాగా దీనిపై కేంద్ర కేబినెట్​ చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

దేశంలో ప్రస్తుతం పురుషుల వివాహ వయసు (Age of marriage in India) కనీసం 21 ఏళ్లు కాగా మహిళలకు మాత్రం 18 ఏళ్లుగా ఉంది.

చట్ట సవరణ..

కనీస వయసు పరిమితి పెంపును అమలు చేసేందుకు.. బాల్య వివహాల నియంత్రణ చట్టం, స్పెషల్ మ్యారేజ్​ యాక్ట్​, హిందూ మ్యారేజ్ యాక్ట్​లలో సవరణలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం జయా జైట్లీ నేతృత్వంలో నీతి ఆయోగ్​ టాస్క్​ ఫోర్స్​ను కూడా నియమించింది.

ఈ టాస్క్​ఫోర్స్​లో ప్రభుత్వ నిపుణుడు వీకే పాల్​, వైద్య, ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి, మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ, న్యాయ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ టాస్క్​ఫోర్స్​లో సభ్యులుగా ఉన్నారు.

ఈ బృందం ఈ నెలలోనే నివేదికను సమర్పించింది. అందులో మహిళలకు కూడా వివాహ వయసు కనీసం 21 ఏళ్లుగా ఉండాలని (Marriage age for Women) నొక్కి చెప్పింది. ఈ వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల.. వారికి పుట్టే పిల్లలు ఆరోగ్యంతో పాటు.. ఆ కుటుంబ ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగ్గా ఉంటాయని అభిప్రాయపడింది.

Also read: MM Naravane: ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా ఎంఎం నరవాణే నియామకం

Also read: Bank Strike Today: నేటి నుంచి రెండు రోజులు బ్యాంకుల సమ్మె- కారణాలివే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News