మధ్యప్రదేశ్ లోరాజకీయం రసకందాయంలో ఉన్న  సమయంలోనే.. గుజరాత్ లోనూ కాంగ్రెస్ పెద్ద షాక్ తగిలింది.  ఇప్పటికే మధ్యప్రదేశ్ లో హస్తం పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు పార్టీ పదవులకు, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి షాకిచ్చారు. అటు కాంగ్రెస్ పార్టీని 18 ఏళ్లుగా అంటి  పెట్టుకుని ఉండి.. అన్నీ తానై వ్యవహరించిన జ్యోతిరాదిత్య సింధియా కూడా హస్తం పార్టీని కాదని. . కమలం గూటికి చేరిపోయారు. ఇప్పుడు గుజరాత్ లోనూ హస్తం పార్టీకి చుక్కలు కనిపిస్తున్నాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాజ్యసభ ఎన్నికల వేళ నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఏకంగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయడం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. రాజ్యసభ ఎన్నికల వేళ .. ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఝట్కాగా భావించవచ్చు. పార్టీ ఎమ్మెల్యేలు మంగళ్ గవిట్, జేవీ కకాడియా, సోమ్ బాయ్ పటేల్, ప్రద్యుమ్న్ జడేజా రాజీనామాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఐతే బీజేపీ..   తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేస్తుందన్న ఉద్దేశ్యంతో నిన్ననే( శనివారం ) 20 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది.  కానీ గుజరాత్ కు 15 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్లారు. మిగతా  ఐదుగురు ఎమ్మెల్యేలు ఆదివారం వస్తామని తెలిపారు. కానీ అందులో నలుగురు ఎమ్మెల్యేలు ఫోన్ కు కూడా అందుబాటులో లేకపోవడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. 


Read Also: మ్యాజిక్ కీ బోర్డ్


మొత్తం 182 మంది ఉన్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీకి 103 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు 73 మంది ఉన్నారు. ఒక్క రాజ్యసభ సీటును దక్కించుకోవాలంటే 37 మంది ఎమ్మెల్యేలు కావాలి. కాంగ్రెస్,  బీజేపీలు చెరో రెండు సీట్లు సులభంగా గెలుచుకోవచ్చు. కానీ బీజేపీ మూడో సీటు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి రాజస్థాన్ కు తరలించింది. బీజేపీ తమ మూడో అభ్యర్థిగా నర్హరి అమిన్ కు టికెట్ కేటాయించింది. ఇప్పటికే బీజేపీకి ఓటు వేసేందుకు భారతీయ ట్రైబల్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు , నేషనలిస్ట్ కాంగ్రెస్ నుంచి ఒకరు సిద్ధంగా ఉన్నారు. బీజేపీ మూడో రాజ్యసభ సీటు గెలవాలంటే ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ క్రమంలో రాజకీయం మొదలైంది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..