invisible keyboard: మ్యాజిక్ కీ బోర్డ్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్..AI.. సాంకేతిక విప్లవం తీసుకొస్తోంది. రానున్న రోజుల్లో దీని ద్వారా అద్భుతాలు జరగనున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులోకి వస్తోంది. అలాంటిదే శ్యామ్‌సంగ్ కంపెనీ రాబోయే కొద్ది రోజుల్లో వినియోగదారులకు అందించనుంది. 

Last Updated : Mar 15, 2020, 01:07 PM IST
invisible keyboard: మ్యాజిక్ కీ బోర్డ్

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్..AI.. సాంకేతిక విప్లవం తీసుకొస్తోంది. రానున్న రోజుల్లో దీని ద్వారా అద్భుతాలు జరగనున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులోకి వస్తోంది. అలాంటిదే శ్యామ్‌సంగ్ కంపెనీ రాబోయే కొద్ది రోజుల్లో వినియోగదారులకు అందించనుంది.  ఇప్పటికే శ్యామ్ సంగ్ కంపెనీ. . AI ద్వారా అద్భుతాలు చేస్తోంది. ఇందులో భాగంగా కీ బోర్డ్ లేకుండానే ట్యాబ్లెట్లు, మొబైల్ ఫోన్‌లలో అక్షరాలు టైప్ చేసుకునేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది.  

సెంచరీకి చేరువలో కరోనా పాజిటివ్ కేసులు

'సెల్ఫీ టైప్' కీ బోర్డ్‌గా దీనికి నామకరణం చేశారు.  అంటే ఇది పేరుకు తగ్గట్టుగానే పని చేస్తుంది. సాధారణంగా మనం కంప్యూటర్‌లో, ట్యాబ్లెట్‌లో , స్మార్ట్ ఫోన్‌లో టైప్ చేయాలంటే భౌతికంగా ఉన్న కీ బోర్డ్ లేదా ఆయా డివైస్‌లలో సాఫ్ట్‌వేర్‌తో ఇన్‌స్టాల్ చేసిన కీబోర్డ్ వాడతాం. కానీ శ్యామ్‌సంగ్ కొత్తగా రూపొందించిన 'సెల్ఫీ టైప్' కీ బోర్డ్‌కు ఇవేవీ అవసరం లేదు. కేవలం ట్యాబ్లెట్, మొబైల్‌కు ఉన్న కెమెరా మాత్రం చాలు. కావాలంటే కంపెనీ విడుదల చేసిన ఈ డెమో వీడియో చూడండి.

చూశారా..!! కీ బోర్డ్ అవసరం లేకుండానే ఎక్కడంటే అక్కడ చాలా సులభంగా టైప్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా కీ బోర్డులు వెంట పెట్టుకుని వెళ్లాల్సిన పని తప్పుతుంది. శ్యామ్ సంగ్ కంపెనీకి చెందిన ఇన్ క్యుబేటర్ C-Labs దీన్ని రూపొందించింది. AI algorithm, ముందున్న కెమెరా ఆధారంగా ఇది పని చేస్తుంది. ఎలాంటి ప్రత్యేక హార్డ్ వేర్‌లు దీనికి అవసరం లేదు. మరికొద్ది రోజుల్లో శ్యామ్ సంగ్ కంపెనీ తమ వినియోగదారులకు కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

 

Trending News