King Cobra Caught: భారీ కింగ్‌ కోబ్రా అతి ప్రమాదకరమైనవి..ఇది ఒక్కసారి దాడి చేస్తే మనిషి ప్రాణాలకే ప్రమాదం..అందుకే చాలా మంది వీటిని చూసిన వెంటనే పరిగేడతారు. ప్రస్తుతం నెట్టింట చాలా రకాల వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. ఇందులో ఎక్కువగా పాములకు సంబంధించివే ఉండడం విశేషం. ఇటీవలే గోవా బీచ్‌లో పామును పట్టిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యానికి గురవుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీరు వీడియో గమనిస్తే..గోవా బీచ్‌లో ఓ పెద్ద కింగ్‌ కోబ్రా సంచారం చేసింది. ఈ పామును చూసిన స్థానికులు దగ్గరలో ఉన్న స్నేక్‌ క్యాచర్స్‌కు సమాచారం అందిచారు. దీంతో వారు హుటాహుటిన పాము సంచారం చేసిన ప్రదేశానికి చేరుకుని.. పామును వెతికేందుకు ప్రయత్నం చేస్తారు. వారంతా కింగ్‌ కోబ్రాను చాలా సేపు వెతుకుతారు. అయినప్పటికీ వారికి ఆ పాము కనిపించదు. చివరికి ఆ బీచ్‌ ప్రదేశంలో పాము కనిపిస్తుంది.   


ఇలా కనబడిన కింగ్‌ కోబ్రాను స్నేక్‌ క్యాచర్స్‌ పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. అయినప్పటికీ భారీ కింగ్‌ కోబ్రా వారికి చిక్కదు. స్నేక్‌ క్యాచర్స్‌ వదలకుండా 10 అడుగుల కోబ్రాను నెలకొరిగిన కొబ్బరి ఆకుల నుంచి బయటకు తీసేందుకు శతవిధాలుగా ప్రయత్నం చేస్తాడు.


Also Read: Ganga Dussehra 2023: గంగా దసరా పండగని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?, ఈ పండగ ప్రాముఖ్యత, పూజా నియమాలు..


ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసిన పామును స్నేక్‌ క్యాచర్‌ పట్టుకోలేకపోతాడు. దీంతో చివరగా ఆ వ్యక్తి పామును బయటికి లాగి ఒక్కసారిగా పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తాడు. వ్యక్తిని గమనించి పాము కాటేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇలా అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత చివరి పామును స్నేక్‌ క్యాచర్‌ పట్టుకుంటాడు. 



ఈ వీడియోను Prince prasad vlogs అనే యూట్యూబ్‌ చానెల్ నుంచి పోస్ట్ చేశారు. ఇప్పటికీ ఈ వీడియోను 5 వేల కంటే ఎక్కువ మంది వీక్షించారు. వైరల్‌ అవుతున్న వీడియోని చూసి నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ కింగ్‌ కోబ్రా సైజ్‌ను చూసి తేగ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా కొందరు ఇలా కామెంట్లు కూడా చేస్తున్నారు..ఇలాంటి పాములు చూడడం చాలా అరుదని.. పాములు మనుషులతో పాటు జంతువులకు కూడా ప్రమాదకరమని కామెంట్లు చేస్తున్నారు.


Also Read: King Cobra Drinking Water: దాహంతో కోపంగా ఉన్న కింగ్ కోబ్రా నీళ్లు ఎలా తాగేసిందో చూడండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి