Sheikh Hasina Future: రిజర్వేషన్ల రద్దు లొల్లి తీవ్ర రూపం దాల్చడంతో బంగ్లాదేశ్‌లో పరిస్థితులు చేయి దాటాయి. దేశం మొత్తం అల్లకల్లోలం కావడంతో ప్రధానమంత్రిగా ఉన్న షేక్‌ హసీనా భారత్‌కు శరణార్థిగా వచ్చారు. ఇక్కడకు వచ్చాక ఆమె తన పదవికి రాజీనామా చేసి ప్రస్తుతం సాధారణ ఎంపీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలో తలదాచుకుంటున్న ఆమె బ్రిటన్‌కు వెళ్లాలని ప్రణాళిక వేసుకున్నారు. లండన్‌ వెళ్లేందుకు ప్రయత్నాలు చేయగా అవి విఫలమయ్యాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Aslo Read: Sheikh Hasina Resign: బంగ్లాదేశ్‌లో సైనిక పాలన? ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా


 


శరణార్థిగా తాము ఆశ్రయం ఇచ్చేందుకు సిద్ధంగా లేమని బ్రిటన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఆమెకు వీసా అంగీకరించలేదని సమాచారం. హసీనాతోపాటు ఆమె ప్రధాని, ఆమె చెల్లెలు రిహన్నకు చెందిన పాస్‌పోర్ట్‌లను ఢిల్లీలోని బ్రిటిష్ హైకమిషన్‌కు తీసుకెళ్లారు. వీసా కోసం దరఖాస్తు చేశారు. అయితే వారి వీసాలకు బ్రిటన్‌ ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. ఈ సమయంలో ఎవరికీ రాజకీయ ఆశ్రయం ఇవ్వబోమని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. బ్రిటన్‌ ప్రభుత్వం ఆమోదం తెలపకపోవడంతో హసీనా కొన్ని రోజుల పాటు భారతదేశంలోనే ఉండనున్నారు.

Also Read: Bangladesh Protests Live Updates: బంగ్లాదేశ్‌లో తీవ్ర సంక్షోభం.. భారత్‌ కీలక నిర్ణయం


 


భారతదేశంలో ఎక్కడ?
శరణార్థిగా వచ్చిన మాజీ ప్రధానమంత్రి షేక్‌ హసీనా భారతదేశంలో తాత్కాలికంగా బస చేస్తున్నారు. అయితే ఆమె ఎక్కడ ఉంటున్నారనేది అందరిలో మెదలుతున్న ప్రశ్న. ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌లోని భారత వాయుసేనకు చెందిన 'హిండన్ ఎయిర్‌బేస్'లో హసీనా నివసిస్తున్నారు. హిండన్ ఎయిర్‌బేస్‌లోనే అతిథి గృహంలో ఆమె బసకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆమె ఉన్నన్నాళ్లు ఈ ఎయిర్‌బేస్‌లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌లోని కొన్ని అసాంఘిక శక్తులు హసీనాపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.


లండన్‌ ఎందుకు?
భారతదేశంలో శరణార్థిగా ఉన్న షేక్‌ హసీనా ఇక్కడ ఉండేందుకు ఇష్టపడడం లేదు. ఆమె లండన్‌ వెళ్లాలనుకుంటున్నారు. అయితే లండన్‌ ఎంచుకోవడానికి కారణం వేరే ఉంది. షేక్ హసీనాకు చెల్లెలు షేక్ రిహన్న ఉన్నారు. ఆమె కుమార్తె తులిప్‌ సిద్దిఖీ లండన్‌లో నివసిస్తోంది. బ్రిటన్‌లో తులిప్‌ పార్లమెంట్‌ సభ్యురాలు. అక్కడ అధికారంలో ఉన్న లేబర్‌ పార్టీ నుంచి తులిప్‌ ఎంపీగా ఎన్నికయ్యారు. దీంతో తనకు సురక్షిత దేశం బ్రిటన్‌గా భావించి హసీనా బ్రిటన్‌ ప్రభుత్వాన్ని ఆశ్రయం అడిగారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter