నక్సల్స్ కు మరోమారు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులో ఆదివారం సీఆర్పీఎఫ్‌ నిర్వహించిన నక్సల్స్ ఏరివేత ఆపరేషన్‌లో 14 మాయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది. గడ్చిరోలి జిల్లా బోరియా అటవీప్రాంతంలోని ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో గడ్చిరోలి డివిజనల్ కమిటీ సభ్యుడు శీను, పేరిమిల్లి దళం కమాండర్ సాయినాథ్ ఉన్నట్లు తెలిసింది. కాగా ఈ దాడిలో పలువురు మావోయిస్టులు గాయాలపాలైనట్లు తెలిసింది. 


శనివారం ఛత్తీస్‌గఢ్‌ లోని సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్‌ జవాన్ ను నక్సల్స్ కాల్చి చంపిన నేపథ్యంలో ఈ ఆపరేషన్‌ నిర్వహించారు. నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాగా ఈ ఆపరేషన్ లో  సీఆర్పీఎఫ్‌ తో పాటు కోబ్రా బలగాలు భాగస్వాములై నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ నిర్వహించినట్లు సంబంధిత అధికారి వెల్లడించారు.