Boat capsize: బీహార్‌లో పడవ బోల్తా.. 70 మంది గల్లంతు
బీహార్ (Bihar) లో ఘర ప్రమాదం సంభవించింది. గంగానదిలో పడవ బోల్తా పడి (Boat capsize) చాలా మంది నీటిలో గల్లంతయ్యారు. గల్లంతయిన వారు 70మందికి పైగానే ఉంటారని ఈ ప్రాంత వాసులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని భాగల్‌పూర్ (Bihar`s Bhagalpur) ప్రాంతంలోని గంగా నది (Ganga river)లో ప్రయాణిస్తున్న పడవ బుధవారం ఉదయం బోల్తా పడింది.
Boat carrying over 100 people capsizes in Bihar's Bhagalpur: పాట్నా: బీహార్ (Bihar) లో ఘర ప్రమాదం సంభవించింది. గంగానదిలో పడవ బోల్తా పడి (Boat capsize) చాలా మంది నీటిలో గల్లంతయ్యారు. గల్లంతయిన వారు 70మందికి పైగానే ఉంటారని ఈ ప్రాంత వాసులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని భాగల్‌పూర్ (Bihar's Bhagalpur) ప్రాంతంలోని గంగా నది (Ganga river)లో ప్రయాణిస్తున్న పడవ బుధవారం ఉదయం బోల్తా పడింది. ఇందులో మొత్తం 100 మంది ప్రయాణికులున్నట్లు పేర్కొంటున్నారు. అయితే ఈ ఘటనలో ఇప్పటివరకు 30 మంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే మిగితా వారి ఆచూకీ లభించలేదు. దీంతో ఈ ప్రాంతంలో ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.
మిగతా వారి ఆచూకీ కోసం ఎస్డీఆర్ఎఫ్ దళాలు (State Disaster Response Force ) రంగంలోకి దిగాయి. ఇప్పటివరకు ఒక్కరి మృత దేహాం మాత్రం లభ్యమైనట్లు బాగల్‌పూర్ జిల్లా మెజిస్ట్రేట్ పేర్కొన్నారు. దీంతోపాటు ఇప్పటివరకు 9మందిని రక్షించినట్లు ఆయన వెల్లడించారు. మిగితా వారి ఆచూకీ కోసం ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ (Rescue & search operation underway) నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. Also read: TRP scam: టెలివిజన్ రేటింగ్స్‌పై కమిటీ ఏర్పాటు
అయితే బీహార్ రాష్ట్రం భాగల్‌పూర్‌లోని గోపాల్‌గంజ్ ప్రాంతంలోని నవగాచియాకు చెందిన టీన్‌షాంగ్ షిప్ ఘాట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ పడవలో అందరూ కూలీలు, రైతులే ఉన్నారని పేర్కొంటున్నారు. వీరంతా పనులకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. దీంతో ఈ ప్రాంతంలో విషాదం నెలకొంది.
[[{"fid":"196747","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"బీహార్ పడవ బోల్తా","field_file_image_title_text[und][0][value]":"బీహార్ పడవ బోల్తా"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"బీహార్ పడవ బోల్తా","field_file_image_title_text[und][0][value]":"బీహార్ పడవ బోల్తా"}},"link_text":false,"attributes":{"alt":"బీహార్ పడవ బోల్తా","title":"బీహార్ పడవ బోల్తా","class":"media-element file-default","data-delta":"1"}}]]