Bihar Boy Exam Hall: పరీక్షా హాలులో అమ్మాయిలు.. చూసి తట్టుకోలేకపోయిన ఇంటర్ విద్యార్థి! చివరికి ఏమైందంటే
Bihar Male Student Faints After Finding Himself Among 500 Girls in Exam Hall. పరీక్షా హాలులో అమ్మాయిలను చూసి ఓ ఇంటర్ విద్యార్థి స్పృహతప్పిపడిపోయాడు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.
Class 12 Student Manish Shankar fainted after seeing 500 Girls in Exam Centre in Bihar. పరీక్షలు అంటే ప్రతి విద్యార్థికి ఏదోమూల కాస్త భయం ఉంటుంది. నెలల తరబడి కస్టపడి చదివినా.. ఎగ్జామ్ రోజు మాత్రం కాస్త టెన్షన్ ఫీల్ అవుతారు. చదివింది మరిచిపోతాననో, చదివిన ప్రశ్నలు వస్తాయో లేదో అనో, టాప్ ర్యాంక్ వస్తదో లేదో అనో, పాస్ అయితామో లేదో అనే పలు కారణాలతో విద్యార్థులు టెన్షన్ పడుతుంటారు. అయితే ఓ అబ్బాయి మాత్రం పరీక్ష హాల్‌లో ఉన్న అమ్మాయిలను చూసి బయపడిపోయాడు. అంతేకాదు స్పృహ తప్పిపడిపోయాడు. ఈ ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.
విషయంలోకి వెళితే... మనీశ్ శంకర్ (17) అనే విద్యార్థి నలందలోని అల్లామా ఇక్బాల్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. మనీశ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం (ఫిబ్రవరి 1) బీహార్‌లో ఇంటర్ పరీక్షలు మొదలయ్యాయి. పరీక్ష రాసేందుకు మనీశ్‌ను అతడి తండ్రి సచ్చిదానంద్ ప్రసాద్.. సుందర్‌గఢ్‌లోని బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్‌కు తీసుకెళ్లాడు. పరీక్షా కేంద్రంలో అందరూ బాలికలే ఉండడం చూసి మనీశ్ షాక్ అయ్యాడు. పరీక్షా కేంద్రంలో 500 మందికి పైగా బాలికలు ఉండగా.. అబ్బాయి మాత్రం మనీశ్ ఒకడే.
పరీక్షా కేంద్రంలో 500 మంది అమ్మాయిలను చూసిన తర్వాత మనీశ్ శంకర్ తీవ్ర భయానికి గురయ్యాడు. తన చుట్టూ ఉన్న అమ్మాయిల మధ్య గణిత పరీక్ష రాస్తున్నప్పుడు మనీష్ చాలా ఉద్విగ్నతకు గురయ్యాడు. దాంతో పరీక్ష హాలులోనే అతడు స్పృహతప్పి పడిపోయాడు. ఇది గమనించిన బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్ స్టాఫ్.. మనీశ్‌ను బీహార్ షరీఫ్ సదర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అతడు కోలుకున్నాడు. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడు.
ఒకేసారి అంత మంది అమ్మాయిలను చూడగానే మనీశ్ శంకర్ కంగారుపడి స్పృహ తప్పిపోయాడని అతడి మేనత్త వెల్లడించారు. '500 మంది అమ్మాయిల మధ్య ఒక అబ్బాయిని కూర్చోబెట్టడం వలనే ఇది జరిగింది. ఒక్కసారిగా వందల మంది అమ్మాయిలను చూసి నా మేనల్లుడు కంగారుపడ్డాడు. దీంతో పరీక్ష రాయకుండా స్పృహ తప్పి పడిపోయాడు. మనీశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు' అని మనీశ్ మేనత్త తెలిపారు. 500 మందికి పైగా బాలికలు ఉన్న పరీక్ష హాల్‌లో ఒక అబ్బాయికి మాత్రమే ఎగ్జామ్ ఎలా పెడతారని కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు.
Also Read: Layoffs 2023: ఇంటెల్ కీలక నిర్ణయం.. లే ఆఫ్‌లకు బదులుగా..! సంతోషంలో ఉద్యోగులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.