Aguwani Sultanganj Bridge Collapse in Bihar: బీహార్‌లోని భాగల్‌పూర్‌లో నిర్మాణంలో ఉన్న అగువానీ-సుల్తమ్‌గంజ్ బ్రిడ్జి ఆదివారం గంగా నదిలో కుప్పకూలింది. ఖగారియా-భాగల్‌పూర్ జిల్లాలను కలిపేలా నిర్మిస్తున్న 100 అడుగుల వంతెన.. నదిలో కుప్పకూలడం ఇది రెండోసారి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కలల ప్రాజెక్టుగా రూ.1750 కోట్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి.. కొంతభాగం గతేడాది ఏప్రిల్‌లో కుప్పకూలింది. గంగా నదిలో వంతెన కూలిన దృశ్యాన్ని స్థానికులు వీడియోలు తీశారు. ప్రస్తుతం బ్రిడ్జి కూలిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వంతెనకు ఏ మేరకు నష్టం జరిగిందనే దానిపై అధికారులు విశ్లేషిస్తున్నారు. "పిల్లర్, సెగ్మెంట్ కూలిపోవడం గురించి మాకు సమాచారం అందింది. బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన ఇంజనీర్లతో మాట్లాడాము. ప్రస్తుతానికి ప్రాణ, ఆస్తి నష్టం గురించి ఇంకా పూర్తి తెలియరాలేదు" అని భాగల్‌పూర్ ఎస్డీఓ ధనంజయ్‌కుమార్‌ తెలిపారు. 


సుల్తాన్‌గంజ్ జేడీయూ ఎమ్మెల్యే లలిత్ నారాయణ్ మండల్ మాట్లాడుతూ.. ఈ ఏడాది నవంబర్-డిసెంబర్‌లో వంతెనను ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలిపారు. బ్రిడ్జి కూలిపోవడానికి గల కారణాలను విచారణ తర్వాతే తెలియజేస్తామన్నారు. దీనికి వెనుక బాధ్యులు ఎవరు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బ్రిడ్జ్ కూలిన ఘటనపై విచారణకు ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ ఆదేశించారు. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించాలన్నారు.



ఆదివారం కావడంతో బ్రిడ్జి నిర్మాణానికి కార్మికులు ఎక్కువగా రాలేనట్లు తెలుస్తోంది. తక్కువ మంది కార్మికులు ఉండడంతో బ్రిడ్జిపై ఎలాంటి పనులు జరగట్లేదని అధికారులు చెబుతున్నారు. వంతెన 3 అడుగుల భాగం కిందనే ఉన్న గంగ నదిలోలో కుప్పకూలినట్లు అధికారులు ప్రాథిమికంగా నిర్ధారించారు. గతేడాది ఏప్రిల్‌లో తుపాను కారణంగా గత బ్రిడ్జిలోని కొంతభాగం దెబ్బతినగా.. తాజాగా మరోసారి కూప్పకులడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.


Also Read: Odisha Train Tragedy: విండో సీటు కోసం కోచ్ మారిన తండ్రీకూతుళ్లు.. క్షణాల్లో ప్రమాదం.. తర్వాత ఏమైందంటే..?  


సీఎం నితీశ్ కుమార్‌, డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌లు రాజీనామా చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తంది. బీజేపీ నేత అమిత్ మాలవీయ్ మాట్లాడుతూ.. 2020లో పూర్తి చేయడమే లక్ష్యంగా ఈ బ్రిడ్జి నిర్మాణ పనులను సీఎం నితీష్ కుమార్ 2015లో ప్రారంభించారని తెలిపారు. గతేడాది ఏప్రిల్‌లోనూ ఈ వంతెనలోని కొంతభాగం కూలిపోయిందని గుర్తు చేశారు. తాజాగా రెండోసారి కుప్పకూలిందని.. ఈ ఘటనకు నితీశ్ కుమార్, తేజస్వీ యాదవ్ బాధ్యత వహించాలని అన్నారు. ఇద్దరూ తమ పదవులకు రాజీనామా చేస్తారా..? అని ప్రశ్నించారు. ఇద్దరు రాజీనామా చేస్తే.. మేనమామ, మేనల్లుడు దేశానికి ఆదర్శంగా నిలుస్తారని ఆయన ట్వీట్ చేశారు. 


Also Read: PF Withdrawal: పీఎఫ్‌ నుంచి డబ్బులు విత్ డ్రా చేస్తున్నారా..? ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి