బీహార్‌లోని మోతీహర ప్రాంతంలో బస్సు అదుపుతప్పి బోల్తా పడడంతో మంటలు చెలరేగి.. 27 మంది సజీవ దహనమయ్యారని సమాచారం. మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఈ సమాచారం అందుకున్న పోలీసులు, సెక్యూరిటీ అధికారులు హుటాహుటిన సంఘటన జరిగిన ప్రాంతానికి చేరి అవసరమైన సహాయాన్ని అందిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే స్థానికులు కూడా సహాయ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇప్పటికే ప్రమాదంలో గాయపడిన అనేకమందిని వైద్యసేవల నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు పంపించగా.. ప్రాథమిక చికిత్సను అందించడం కోసం అంబులెన్స్‌లు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ బస్సు ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిందని తెలుస్తోంది. బీహార్ సీతామర్హి ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో 10 మంది చనిపోయాక.. అలాంటి ఘటనే నెల రోజులు తిరక్కుండానే మళ్లీ బీహార్‌లో జరగడం గమనార్హం.


ఈ సంఘటనను చాలా బాధాకరమైన సంఘటనగా బీహార్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్, రిలీఫ్ మంత్రి తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి రూ.4 లక్షలను ఎక్స్‌గ్రేషియాగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆ ఘటనలో ప్రయాణికులకే కాకుండా బస్సు నుండి మంటలు చెలరేగినప్పుడు అటువైపు వెళ్తున్నవారికి కూడా గాయాలైనట్లు వార్తలు వస్తున్నాయి.