Bihar prohibition: బీహార్ లో సంపూర్ణ మద్య నిషేధాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీసులు కూడా మద్యం తాగకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. తాగి విధులకు హాజరైతే శాశ్వతంగా ఉద్యోగం నుంచి పీకేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిహార్‌లో 2016 నుంచి సంపూర్ణ మధ్య నిషేధం ( Prohibition )అమల్లో ఉంది. మద్య నిషేధాన్ని పక్కాగా అమలు చేసేందుకు సీఎం నితీశ్ కుమార్ ( Nitish kumar ) ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గ్రామాల్లో పూర్తిగా మద్యపాన నిషేధం అమలు చేసే బాధ్యతను చౌకీదార్లకు అప్పగించారు. గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తూ దొరికితే దానికి బాధ్యులుగా చౌకీదారులపై చర్యలు తీసుకోవాలనే ఆదేశాల ఉండడంతో పక్కాగా మద్య నిషేధం అమల్లో ఉంది. ఇప్పుడు సంపూర్ణ మద్య నిషేధంలో భాగంగా పోలీసులపై కూడా చర్యలు తీసుకోనున్నారు. కఠినమైన ఆంక్షలు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 


రాష్ట్రంలో పోలీసులు ఎవరైనా మద్యం తాగి విధుల్లోకి వస్తే వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని సీఎం నితీశ్‌ నిర్ణయించారు. పోలీసులు ఎవరైనా తాగి కనిపిస్తే వారిని తక్షణమే డిస్మిస్ చేయాలంటూ అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో పోలీసులంతా తాము మద్యం తాగబోమని ప్రతిజ్ఞ కూడా చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు.  బీహార్ లో  సంపూర్ణ మద్య నిషేధం ( Prohibition )పగడ్బందీగా అమలు జరగాలంటే కఠినమైన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భావిస్తున్నారు. ఇప్పటికే మద్యం సేవించిన పోలీసుల్ని ఉద్యోగాల్నించి తొలగించారు. ఇప్పటివరకూ 4 వందల మంది పోలీసుల్ని మద్యం తాగి వచ్చినందుకు ఉద్యోగాల్నించి తొలగించారు


Also read: Puducherry Crisis: ఐదుగురు ఎమ్మెల్యేల రాజీనామా, మైనార్టీలో పడిపోయిన పుదుచ్చేరి ప్రభుత్వం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook