సుప్రీంకోర్టు తీర్పుతో ( Supreme court judgement ) బీహార్ పోలీసుల వైఖరి, ఎఫ్ ఐ ఆర్ సరైన చర్యగా నిర్ధారణైందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. సుశాంత్ సింహ్ రాజ్ పుత్ కేసును సీబీఐకు అప్పగించడంపై  ఆయన స్పందించారు. అయితే ఈ విషయంపై రాజకీయంగా వ్యాఖ్యలు చేయనన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బాలీవుడ్ నటుడు  సుశాంత్ సింహ్ రాజ్ పుత్ ( Bollywood actor sushant singh rajput ) మరణ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఓ దశలో ముంబై-పాట్నా పోలీసుల ( Mumbai-patna police ) మద్య వైరాన్ని సైతం తెచ్చిపెట్టింది. పాట్నాపోలీసులు తనపై నమోదు చేసిన కేసును మంబైకు బదిలీ చేయాలంటూ సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి ( Rhea chakraborty ) సుప్రీంకోర్టులో ( Supreme court ) దాఖలు చేసిన పిటీషన్ పై కోర్టు తీర్పు వెలువడింది. ఈ కేసు విచారణను సీబీఐకు ( CBI probe ) అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా సీబీఐ దర్యాప్తు ముంబై పోలీసులు సహకరించాలని కోరింది. అయితే ఇదే కేసును బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విజ్ఞప్తి మేరకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీబీఐకు అప్పగించింది.



ఈ కేసులో బీహార్ పోలీసుల ( Bihar police ) వైఖరి గానీ ఎఫ్ ఐ ఆర్ ( FIR ) నమోదు గానీ సరైన చర్యగా సుప్రీం తీర్పుతో స్పష్టమైందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ( Bihar cm nitish kumar ) వెల్లడించారు. ఇది ఒక్క సుశాంత్ కుటుంబం కోసమే కాదని..మొత్తం దేశం ఆసక్తి చూపిస్తోందన్నారు. సీబీఐ దర్యాప్తుతో ఈ కేసులో న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నట్టు నితీష్ తెలిపారు. ఫిర్యాదు వచ్చిన తరువాత స్పందించడం బీహార్ పోలీసుల విధి అని..అయితే ముంబై పోలీసులు సహకరించలేదన్నారు. జరిగింది సరైంది కాదని సుప్రీంకోర్టు తీర్పుతో తేటతెల్లమైందన్నారు. ఈ సమయంలో రాజకీయంగా దీనిపై వ్యాఖ్యలు చేయదల్చుకోలేదన్నారు నితీష్ కుమార్. Also read: Delhi Rains: కూలిన గోడ చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదుగా...