Father Rapes Daughter in Bihar: బీహార్‌లోని సమస్తీపూర్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే ఆమెపై కాటు వేశాడు. కామంతో ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఒకటి కాదు, రెండు కాదు పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధిత యువతి సీక్రెట్ కెమెరాతో తండ్రి లైంగిక దాడిని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాధితురాలు వెల్లడించిన వివరాల ప్రకారం... ఆమె తండ్రి ఒక టీచర్. 18 ఏళ్ల తనపై తండ్రి (50) కొన్నాళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఈ విషయం ఆమె తల్లికి, మేనమామకు కూడా తెలుసు. విషయం ఎవరికీ చెప్పొద్దని ఆ ఇద్దరు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. తండ్రి తనపై చేస్తున్న ఆకృత్యాన్ని ఎలాగైనా బయటపెట్టాలని భావించిన ఆ యువతి... సీక్రెట్ కెమెరాతో ఆ అఘాయిత్యాన్ని చిత్రీకరించింది.


ఆ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసి తనకు న్యాయం చేయాల్సిందిగా అధికారులకు విజ్ఞప్తి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని స్థానిక సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ అక్తర్ వెల్లడించారు.


పోలీసులపై బాధిత యువతి ఆరోపణలు :


తన కేసు విషయంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత యువతి ఆరోపించింది. తండ్రి తనపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేస్తే పోలీసులు మొదట పట్టించుకోలేదని వాపోయింది. బాధితురాలు సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన తర్వాతే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆమె తండ్రితో పాటు ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన బీహార్‌లో సంచలనం రేపుతోంది.


Also Read: Saturday Shani Mantra: శనివారం ఈ 3 మంత్రాలు పఠిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి..   


Also Read: Sarkaru Vaari Paata: మహేష్ బాబు 'సర్కారు వారి పాట'కు జగన్ సర్కార్ గుడ్ న్యూస్...   


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook