UP Rape Incident: పబ్లిక్ టాయిలెట్‌లో 20 ఏళ్ల యువతిపై అత్యాచారం...

Uttar Pradesh Rape Incident: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో దారుణం వెలుగుచూసింది. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ పబ్లిక్ టాయిలెట్‌లో 20 ఏళ్ల యువతి అత్యాచారానికి గురైంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 20, 2022, 09:31 PM IST
  • ఉత్తరప్రదేశ్‌లో యువతిపై అత్యాచారం
  • పబ్లిక్ టాయిలెట్‌లో 20 ఏళ్ల యువతిపై రేప్
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
UP Rape Incident: పబ్లిక్ టాయిలెట్‌లో 20 ఏళ్ల యువతిపై అత్యాచారం...

Uttar Pradesh Rape Incident: ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో దారుణం వెలుగుచూసింది. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ పబ్లిక్ టాయిలెట్‌లో 20 ఏళ్ల యువతి అత్యాచారానికి గురైంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... శనివారం (మార్చి 19) ఓ యువతి తన భర్తతో కలిసి ప్రతాప్‌గఢ్ రైల్వే స్టేషన్‌కి వచ్చింది. అహ్మదాబాద్ ట్రైన్ ఎక్కేందుకు టికెట్లు తీసుకున్న ఆ భార్యాభర్తలు రైలు కోసం ఎదురుచూస్తూ ప్లాట్‌ఫామ్‌పై నిలబడ్డారు. ఇంతలో ఆ యువతి భర్త తినేందుకు ఏమైనా తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లాడు.

భర్త అక్కడి నుంచి వెళ్లాక ఆ యువతి సమీపంలోని వాష్‌రూమ్‌కి వెళ్లింది. అయితే అప్పటికే అందులో ఎవరో ఉండటంతో అక్కడి నుంచి కొంచెం దూరంలోని టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి నిలబడింది. కాసేపటికి ఆమె వద్దకు వచ్చిన ఓ వ్యక్తి.. మీకేమైనా సాయం కావాలా అని ఆమెను అడిగాడు. వాష్‌రూమ్ వెళ్లేందుకు చూస్తున్నానని ఆమె బదులిచ్చింది. దీంతో పాకెట్ నుంచి తాళం చెవి తీసి ఆమె చేతిలో పెట్టిన అతను.. అది వాష్‌రూమ్ తాళమని చెప్పాడు. ఆ తాళం తీసుకుని వాష్‌రూమ్ వద్దకు వెళ్లిన ఆ యువతి.. వాష్‌రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లబోయింది.

అంతే, వెనకాలే వచ్చిన సదరు వ్యక్తి ఆమెను లోపలికి నెట్టేసి.. తానూ లోపలికి దూరి  తలుపును లాక్ చేశాడు. ఆపై ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి పరిగెత్తగా.. నిందితుడు టాయిలెట్ నుంచి బయటకొచ్చి పారిపోయాడు. ఘటనపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: Etela Rajender Birthday: ఈటల రాజేందర్‌కు సీఎం కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు...

Also Read: Russia-Ukraine war: రష్యా దాడులకు వందల సంఖ్యలో ఉక్రెయిన్ చిన్నారులు బలి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News