Bihar minister’s son fire incident : మంత్రి కుమారుడిపై గ్రామస్తుల దాడి, తుపాకీ లాకెళ్లారట!
Bihar minister’s son beaten up after allegedly opening fire : బిహార్ మంత్రి కుమారుడు బబ్లూ కుమార్ ఘటనలో మరో అప్డేట్. ఫామ్ హౌజ్‌లో క్రికెట్ ఆడుతోన్న పిల్లల్ని భయపెట్టేందుకు గాల్లోకి కాల్పులు జరపడంతో గ్రామస్తుల ఆగ్రహం. బబ్లూ కుమార్ లైసెన్స్ తుపాకీని గ్రామస్తులు తీసుకెళ్లారంటూ ఆరోపణలు.
Bihar Minister's Son Beaten Up : కొందరు చిన్న పిల్లలు ఒక మంత్రి కుమారుడి ఫామ్ హౌజ్‌లో క్రికెట్ ఆడుతుండగా.. ఆ మంత్రి తనయుడికి చిర్రెత్తుకొచ్చింది. దీంతో క్రికెట్ ఆడుతోన్న పిల్లల్ని భయపెట్టేందుకు ఏకంగా గాల్లోకి కాల్పులు జరిపాడు. ఈ ఘటన బిహార్‌లోని పశ్చిమ చంపారన్ ఈ ఘటన చోటుచేసుకుంది. బిహార్ పర్యాటక శాఖ మంత్రి అయిన నారాయణ్ ప్రసాద్ (Bihar Tourism Minister Narayan Prasad) కుమారుడు బబ్లూ కుమార్ ఇలా గాల్లోకి కాల్పులు జరిపాడు. తన ఫామ్‌హౌజ్‌లో క్రికెట్ ఆడుతున్న చిన్న పిల్లలను అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు అడగడానికి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
మంత్రి కుమారుడు బబ్లూ కుమార్ (Bablu Kumar) క్రికెట్ ఆడుతోన్న తమను కొట్టారంటూ కొందరు పిల్లలు పేర్కొన్నారు. అలాగే తమకు గాయాలు అయ్యాయంటూ కొందరు తెలిపారు. ఇక గాల్లోకి కాల్పులు జరిపి తమను భయాందోళనలకు గురి చేశాడని ఆ పిల్లలు పేర్కొన్నారు. ఇక ఈ ఘటన వెలుగులోకి రావడంతో గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ ప్రసాద్ ఇంటికి చేరుకుని, ఆందోళన చేప్టటారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు.
అలాగే ఫామ్‌హౌజ్‌లో ఉన్న మంత్రి కుమారుడుని చితకబాదారు. పరిస్థితి విషమించడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఆందోళనను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు.
గ్రామస్థులు ప్రయత్నించడంతో అక్కడకు వెళ్లామని ఫిర్యాదు చేశారన్నారు.
ఇందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అందులో మంత్రి కుమారుడు బబ్లూ కుమార్‌ను గ్రామస్థులు కొడుతున్న దృశ్యాలు ఉన్నాయి. మంత్రి కుమారుడి నుంచి తుపాకీని కూడా గ్రామస్తులు లాక్కున్నారని తెలుస్తోంది.
అయితే ఎస్పీ ఉపేంద్ర వర్మ తెలిపిన వివరాల ప్రకారం... మంత్రి కుమారుడితో పాటు అతని బాబాయ్ హరేంద్ర ప్రసాద్, ఇతర అనుచరులు ఈ ఘర్షణలో గాయపడ్డారు. ఇక ఆత్మరక్షణ కోసం తాను తీసుకెళ్లిన తన లైసెన్స్ తుపాకీని (licensed gun) గ్రామస్తులు తీసుకెళ్లారని, తమ వాహనాలను ధ్వంసం చేశారంటూ బబ్లూ కుమార్ పేర్కొన్నారు.
అలాగే తాను గాల్లో ఎలాంటి కాల్పులు జరపలేదంటూ బబ్లూ కుమార్ అంటున్నారు. మంత్రి కుమారుడు బబ్లూ కుమార్ ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు. ఇక ఈ ఘటనపై విచారణ చేపడుతున్నామని పోలీసులు (Police) తెలిపారు.
Also Read : Republic Day Parade: రిపబ్లిక్ డే పరేడ్ లో వాళ్లకు అనుమతి లేదు.. మార్గదర్శకాలు జారీ
మంత్రి నారాయణ్ ప్రసాద్ మరో రకంగా వాదిస్తున్నారు. గ్రామస్థులంతా కలిసి తన భూమిని అక్రమంగా ఆక్రమించుకునేందుకు ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారంటూ ఆరోపిస్తున్నారు మంత్రి నారాయణ్ ప్రసాద్. ఆక్రమణను అడ్డుకోవడానికి ప్రయత్నించిన తన సోదరుడిపై కూడా గ్రామస్థులు దాడి చేశారంటూ మంత్రి నారాయణ్ ప్రసాద్ పేర్కొన్నారు.
Also Read : Viral Video: మైదానంలోనూ 'పుష్ప' మేనియా.. తగ్గేదేలే అంటోన్న బంగ్లాదేశ్ క్రికెటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook