Viral Video: తగ్గేదేలే అంటోన్న క్రికెటర్లు... పుష్పరాజ్ మేనరిజంతో అలరించిన బంగ్లాదేశ్ క్రికెటర్

Pushpa Movie: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప' సినిమాకు క్రేజ్ ఎక్కడా తగ్గడం లేదు. సామాన్యులే కాకుండా స్టార్‌క్రికెటర్లు సైతం 'పుష్ప' సినిమాలోని పాటలకు స్టెప్పులేస్తూ, డైలాగ్‌లు చెప్తున్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 24, 2022, 12:02 PM IST
  • బీపీఎల్ లో పుష్ప క్రేజ్
  • పుష్పరాజ్ మేనరిజంతో అలరించిన బంగ్లాదేశ్ క్రికెటర్
Viral Video: తగ్గేదేలే అంటోన్న క్రికెటర్లు... పుష్పరాజ్ మేనరిజంతో అలరించిన బంగ్లాదేశ్ క్రికెటర్

 BPL-2022: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప' (Pushpa Movie) మేనియా ఇప్పట్లో తగ్గేలా లేదు. సౌత్ నుంచి నార్త్ వరకు పుష్ప క్రేజ్ కొనసాగుతుంది. ఇందులోని ప్రతి పాట, డైలాగ్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా శ్రీవల్లి, ఊ అంటావా.. ఊహు అంటవా.. సామి సామి పాటలకు తమ స్టైల్లో స్టెప్పులేస్తూ అదుర్స్ అనిపిస్తున్నారు. సామాన్యులే కాకుండా స్టార్‌క్రికెటర్లు సైతం 'పుష్ప' సినిమాలోని పాటలకు స్టెప్పులేస్తూ, డైలాగ్‌లు చెప్తున్నారు. 

తాజాగా బంగ్లాదేశ్ క్రికెటర్ (Bangladeshi cricketer) సైతం పుష్ప రాజ్ మేనరిజంకు ఫిదా అయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (Bangladesh Premier League-BPL)లో బౌలర్ అమిత్ హసన్ (Amit Hassan) వికెట్ తీసిన ఆనందంలో నీ అవ్వ తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ (Allu Arjun) మేనరిజాన్ని ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతుంది.

Also Read: Sami Sami Song: సామీ సామీ పాటకు డేవిడ్ వార్నర్ కూతుళ్ల డ్యాన్స్‌పై బన్నీ రియాక్షన్

ఇంతకముందు.. ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ (David Warner).. ఈ సినిమాలోని శ్రీవల్లి పాటకు డ్యాన్స్ చేసి నెటిజన్లను ఫిదా చేశాడు. టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్‌ రైనా (Suresh Raina) పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు.. బన్నీ సిగ్నేచర్‌ మూమెంట్‌ను అచ్చుగుద్దినట్టుగా దించేశాడు. సినిమాలో పుష్పరాజ్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా.... జడేజా ( Ravindra Jadeja) చెప్పిన డైలాగ్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. యువ క్రికెటర్లు ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ శ్రీవల్లి పాటకు స్టెప్పులేశారు. భారత్‌ స్టార్‌ క్రికెటర్ శిఖర్‌ ధావన్‌, టీమ్​ఇండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్‌ పఠాన్‌, ఆర్సీబీ ప్లేయర్​ రాహుల్‌ చాహర్‌లు సైతం ఈ మూవీకి ఫిదా అయిపోయారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

Trending News