Man Attacks Bindu Ammini: శబరిమలలోని అయ్యప్ప స్వామి గుడిని (2019లో) సందర్శించిన తొలి మహిళగా బిందు అమ్మిని వివాదంలో చిక్కుకుంది. ఈమెపై బుధవారం కోజికోడ్ బీచ్ లో గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఇదే విషయమై బిందు అమ్మిని కోర్టును ఆశ్రయించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుర్తుతెలియని వ్యక్తులు కొందరు కోజికోడ్ నార్త్ బీచ్ లో దాడికి తెగబడ్డారని ఆమె ఫిర్యాదు చేసింది. మరోవైపు బిందు అమ్మినిపై దాడికి పాల్పడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


కొన్ని జాతీయ వార్తా సంస్థల నివేదిక ప్రకారం.. వెల్లయిల్ పోలీసులు ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్స్ 509, 323 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమెపై దాడికి పాల్పడే ముందు.. శబరిమల ఆయ్యప్ప స్వామి గుడిని సందర్శించిన బిందు అమ్మిని అని గుర్తించి, వారందరూ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బాధితురాలు ఆరోపించింది. 


బీచ్ ప్రాంగణంలో తల కాంక్రీట్ దిమ్మపై పడేసి.. బిందు అమ్మినిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. అదే సమయంలో అక్కడున్న కొంతమంది ఆ సంఘటనను మొబైల్ లో రికార్డు చేశారు. ఇప్పుడా వీడియోలు వైరల్ గా మారాయి.  



శబరిమల గుడి ప్రవేశం వివాదం


శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశాన్ని నిషేధిస్తూ 2018లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత శబరిమల ఆలయంలోకి ప్రవేశించిన ఇద్దరు మహిళల్లో అమ్మిని ఒకరు. అయితే ఆ ఘటన తర్వాత గుడిని సందర్శించిన ఇద్దరు మహిళలకు ప్రాణాపాయం దాడి చేస్తారన్న ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశం మేరకు వారిద్దరికి కేరళ ప్రభుత్వం భద్రతను ఏర్పాటు చేసింది. అయితే ఆ ఇద్దరు మహిళలు (కనకదుర్గ, బిందు అమ్మిని) శబరిమల గుడి ప్రవేశం చేయడం వల్ల అప్పట్లో కేరళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. 


బిందు అమ్మినిపై రెండోసారి దాడి


శబరిమలలో అయ్యప్ప స్వామి గుడిని సందర్శించిన నేపథ్యంలో బిందు అమ్మనిపై గతంలోనూ దాడి జరిగింది. కొందరు దుండగులు ఆమెపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. కేరళలో ఓ బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు ముఖంపై కారం కొట్టి దాడి చేశారని ఆమె ఆరోపించింది. ఆ తర్వాత ఇప్పుడు కోజికోడ్ బీచ్ లో ఇప్పుడు మరోసారి దాడికి పాల్పడ్డారు.  


Also Read: Tihar Jail Prisoner Suicide: తిహార్ జైలులో ఐదురుగు ఖైదీలు సూసైడ్ అటెంప్ట్


Also Read: India Corona Cases Today: దేశంలో కరోనా విలయం.. లక్షకు చేరువైన కొవిడ్ కేసులు- 325 మరణాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.