Aviptadil Medicine: కరోనా మహమ్మారికి మరో మందు తయారైంది. అత్యవసర అనుమతి పొందితే త్వరలో మార్కెట్లో రానుంది. ఇది కూడా హైదరాబాద్‌కు చెందిన కంపెనీ కావడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా వైరస్(Corona Virus) మహమ్మారి కట్టడికి ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు వివిధ రకాల ప్రత్యామ్నాయ మందులు అందుబాటులో వస్తున్నాయి. డీఆర్డీవో, డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ సంయుక్తంగా కలిసి అభివృద్ధి చేసిన 2 డీజీ మందు ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో వచ్చింది. మంచి ఫలితాల్ని చూపిస్తోందని తెలుస్తోంది. ఇప్పుడు మరో హైదరాబాద్ కంపెనీ మరో మరో కొత్తమందును(New Medicine for Coronavirus) అభివృద్ధి చేసింది. అవిప్టడిల్ అనే మందును హైదారాబాద్‌కు చెందిన బయోఫోర్ కంపెనీ తయారు చేసింది. కోవిడ్ సీరియస్ కేసుల్లో ఈ మందు అద్భుతంగా పనిచేస్తోందని బయోఫోర్ తెలిపింది. అవిప్టడిల్ మందును అత్యవసర వినియోగం కింద అనుమతివ్వాల్సిందిగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు(DCGI)ఆ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. డీసీజీఐ నుంచి అనుమతి లభించిన వెంటనే వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించనుంది.


కోవిడ్ సీరియస్ కేసుల్లో అవిప్టడిల్ మందు(Avistadil medicine) తో రోగులు వేగంగా కోలుకుంటున్నట్టు రుజువైందని బయోఫోర్(Biophore) ప్రకటించింది. ఇదే కంపెనీ కరోనా మొదటి వేవ్ సమయంలో ఫావిపిరవర్(Favipiravir)ఉత్పత్తికి అనుమతి పొందింది.


Also read: Black fungus cases: దేశంలో 28,252 బ్లాక్ ఫంగస్ కేసులు.. ఆ 2 రాష్ట్రాల్లోనే అత్యధిక కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook