Biperjoy Effect: బిపర్‌జోయ్ విధ్వంసం, గుజరాత్లో భారీ వర్షాలు, భీకరమైన గాలులు
Biperjoy Effect: గుజరాత్లో బిపర్‌జోయ్ అతి తీవ్ర తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే తీరం తాకిన తుపాను తీరం దాటే ప్రక్రియ కొనసాగుతుండటంతో భీకర గాలులు రాష్ట్రంలో విధ్వంసం రేపుతున్నాయి. భారీ వర్షం అతలాకుతలం చేస్తోంది.
Biperjoy Effect: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జోయ్ తుపాను అతి తీవ్ర తుపానుగా మారి..సాయంత్రం గుజరాత్‌లోని లఖ్‌పత్ సమీపంలో తీరాన్ని తాకింది. ప్రస్తుతం తీరం దాటే ప్రక్రియ కొనసాగుతోంది. అందుకే రాష్ట్రంలో బీభత్సం నెలకొంది. రాత్రికి పరిస్థితి మరింతగా విషమించవచ్చని సమాచారం.
అరేబియా సముద్రంలో ఏర్పడిన పెను తుపాను బిపర్‌జోయ్ రాష్ట్రంపై విరుచుకుపడుతోంది. గుజరాత్ కచ్ తీరం, పాకిస్తాన్ కరాచీ తీరంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. గుజరాత్‌లోని లఖ్‌పత్ సమీపంలో మహోగ్రరూపంతో తీరం దాటిన బిపర్‌జోయ్ సైక్లోన్ అంతకంతకూ బలపడుతూ తీరం దాటే ప్రక్రియలో ఉంది. రాత్రికి కచ్ తీరం దాటి మాండ్వీ, కరాచీ వైపు కదిలి అక్కడ తీరం దాటనుంది. ఊహించినట్టే సాయంత్రం నుంచి గుజరాత్, పాకిస్తాన్ ప్రాంతాల్లో పరిస్థితి మారిపోయింది. భారీ వర్షాలు, భీకర గాలులతో బీభత్సం జరుగుతోంది. గుజరాత్ కచ్ తీరంలో అయితే పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. గంటకు 120 కిలోమీటర్ వేగంతో వీస్తున్న గాలులతో పెట్రోల్ బంక్ కప్పులు, చిన్న చిన్న ఇళ్లు, హోటళ్లు కొట్టుకుపోతున్నాయి. విద్యుత్ స్థంభాలు, చెట్లు నేలకొరుగుతున్నాయి.
తుపాను కేటగరీ 3 ప్రకారం అత్యంత తీవ్ర తుపానుగా పరిగణిస్తున్నారు. గుజరాత్ కచ్ తీరంతో పాటు ద్వారక, జామ్నా నగర్ జిల్లాల్లో ఊహించని స్థాయిలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఊహించినట్టే బలమైన ఈదురుగాలులు విధ్వంసం రేపుతున్నాయి. బిపర్‌జోయ్ సైక్లోన్ బీభత్సాన్ని దృష్టిలో ఉంచుకునే ఇప్పటికే 120 గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 20 ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో మునిగి ఉన్నాయి. రాత్రికి పరిస్థితి మరింత విషమించి రేపటి వరకూ భారీ వర్షాలు కొనసాగవచ్చనే అంచనాల నేపధ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్ టీమ్స్ సిద్ధంగా ఉన్నాయి.
Also read: Biperjoy Super Cyclone: తీరం తాకిన బిపర్‌జోయ్ సూపర్ సైక్లోన్, భయపెడుతున్న సైక్లోన్ ఐ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook