Bipin Rawat Helicopter Crash: హెలీకాప్టర్ ప్రమాదంలో 11 మంది మృతి, బిపిన్ రావత్‌కు తీవ్ర గాయాలు
Bipin Rawat Helicopter Crash: తమిళనాడులో జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ స్వయంగా సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో 11 మంది మరణించినట్టు తెలుస్తోంది. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ పరిస్థితి..
Bipin Rawat Helicopter Crash: తమిళనాడులో జరిగిన హెలీకాప్టర్ ప్రమాదంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ స్వయంగా సమీక్షిస్తున్నారు. ఈ ప్రమాదంలో 11 మంది మరణించినట్టు తెలుస్తోంది. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ పరిస్థితి..
తమిళనాడులోని కూనూరు సమీపంలో ఉన్న వెల్లింగ్టన్ బేస్‌లో జరిగిన ఘోర హెలీకాప్టర్ ప్రమాదం అందర్నీ ఉలిక్కిపాటుకు గురి చేసింది. భారత ఆర్మీ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ సహా ఆర్మీ ఉన్నతాధికారులు హెలీకాప్టర్‌లో ప్రయాణిస్తుండటంతో ఒక్కసారిగా కలవరం రేగింది. కోయంబత్తూరు, కూనూరు మధ్య జరిగిన ఈ ప్రమాదంలో 11 మంది చనిపోయినట్టు సమాచారం అందుతోంది. ప్రమాద సమయంలో హెలీకాప్టర్‌లో 14 మంది ఉన్నారు. ఇందులో 5 గురు క్రూ సిబ్బంది కాగా మిగిలినవారు ఆర్మీ అధికారులు. బిపిన్ రావత్(Bipin Rawat) భార్య మధులిక కూడా ప్రమాద సమయంలో హెలీకాప్టర్‌లో ఉన్నారు. బిపిన్ రావత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా సమచారం తెలియాల్సి ఉంది. ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
సూలూరు బేస్ నుంచి మద్యాహ్నం 11 గంటల 47 నిమిషాలకు హెలికాప్టర్(Helicopter)బయలుదేరింది. 12 గంటల 20 నిమిషాలకు ప్రమాదానికి లోనైంది. ప్రమాదం జరిగిన ప్రదేశం వెల్లింగ్టన్ మిలిటరీ విలేజ్ నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఘటనా ప్రాంతానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బయలుదేరారు.
Also read: Bipin Rawat Helicopter Crash Photos: బిపిన్ రావత్ హెలీకాప్టర్ ప్రమాద దృశ్యాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి