Bipin Rawat Helicopter Crash: ఆర్మీ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ హెలీకాప్టర్ ప్రమాదంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దేశమంతా ఉలిక్కిపడేలా చేసిన ఈ ప్రమాదంపై వివిధ రకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడులోని వెల్లింగ్టన్ బేస్‌లో జరిగిన ఘోర హెలీకాప్టర్ ప్రమాదం అందర్నీ కలచివేస్తోంది. భారత ఆర్మీ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ఎంఐ 17 అటవీప్రాంతంలో కూలిపోయింది. ప్రయాణ సమయంలో బిపిన్ రావత్‌తో పాటు భార్య మధులిక ఇతర ఆర్మీ ఉన్నతాధికారులున్నారు. హెలీకాప్టర్ సామర్ధ్యం 24 మంది కాగా ప్రయాణ సమయంలో 14 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో 11 మంది మరణించగా..మరో ముగ్గురికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా బిపిన్ రావత్‌కు(Bipin Rawat) తీవ్రగాయాలవడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. 


ఈ హెలీకాప్టర్ ప్రమాదంపై (Helicopter Crash)పలు సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రతికూల వాతావరణం కారణమా లేదా సాంకేతిక లోపమా అనే విషయంపై చర్చ నడుస్తోంది. లేదా హెలీకాప్టర్ విద్యుత్ తీగలకు తాకిందా అనేది కూడా తేలాల్సి ఉంది. తక్కువ ఎత్తులో ప్రయాణించిందా లేదా విజిబిలిటీ లేకపోవడమేనా అనేది  నిర్ధారణ కావల్సి ఉంది. 


ప్రత్యక్షసాక్షి చెబుతున్నదాని ప్రకారం పెద్ద శబ్దాలు రావడంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చాడు.ఆ సమయంలో హెలీకాప్టర్ చెట్టును ఢీకొని మంటలు రేగాయి. మరో మూడింటిని ఢీకొంది. ప్రమాదం జరిగినప్పుడు హెలీకాప్టర్ నుంచి అనేక మృతదేహాలు రాలిపడ్డాయి.


Also read: Bipin Rawat Helicopter Crash: హెలీకాప్టర్ ప్రమాదంలో 11 మంది మృతి, బిపిన్ రావత్‌కు తీవ్ర గాయాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి