త్రిపుర తరువాతి ముఖ్యమంత్రిగా బిప్‌లాబ్ కుమార్ దేబ్ ఉంటారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ధ్రువీకరించారు. త్రిపురను రెండు దశాబ్దాలుగా పరిపాలించిన లెఫ్ట్ ప్రభుత్వాన్ని బీజేపీ- ఐపీఎఫ్టీ కూటమి కూల్చేసింది. మంగళవారం విలేకరుల సమావేశంలో గడ్కారీ ఈ ప్రకటన చేశారు. బిప్‌లాబ్ కుమార్ దేబ్ తో పాటు జిష్ణు దేవ్ బర్మన్ త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతారని వెల్లడించారు. కాగా తనను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన పార్టీ అధిష్టానానికి బిప్‌లాబ్ కుమార్ కృతజ్ణతలు తెలిపారు.


భారతీయ జనతా పార్టీ(బీజేపీ) త్రిపుర రాష్ట్ర అధ్యక్షుడు త్రిపురలో బీజేపీని విజయం దిశగా నడిపించారు. ఈయన బనమాలిపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. మాజీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్త అయిన దేబ్, రాజకీయాల్లోకి రాకముందు ఢిల్లీలో ప్రొఫెషనల్ జిమ్ బోధకుడుగా పనిచేశారు.