INDIGO: ఇండిగో విమానాన్ని ఢికొన్న పక్షి
ముంబై నుంచి ఢిల్లీకి పయనమైన ఇండిగో విమానానికి( Indigo flight) ఊహించని పరిణామం ఎదురైంది. నింగిలోకి ఎగరిన కాసేపటికే ఓ పక్షి విమానానికి (Bird hit forces flight) ఢీకొనడంతో వెంటనే తిరిగి ముంబైకి రావలసివచ్చింది.
Bird hit forces Indigo flight: ఢిల్లీ: ముంబై నుంచి ఢిల్లీకి పయనమైన ఇండిగో విమానానికి ( Indigo flight) ఊహించని పరిణామం ఎదురైంది. నింగిలోకి ఎగరిన కాసేపటికే ఓ పక్షి విమానానికి (Bird hit forces flight) ఢీకొనడంతో వెంటనే తిరిగి ముంబైకి రావలసివచ్చింది. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగకపోవడంతో అందరరూ ఊపిరి పీల్చుకున్నారు. 6E 5047 ఇండిగో విమానం ముంబై నుంచి ఢిల్లీకి పయనమైంది. ఈ క్రమంలో పక్షి ఢీకొనడంతో మళ్లీ ముంబై తిరిగిరావలసి వచ్చింది. దీంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసినట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు కలిగిన ఈ అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఇండిగో వెల్లడించింది. వాస్తవానికి ఇండిగో విమానం ఉదయం 8.05 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA) నుంచి ఢిల్లీకి పయనమైనట్లు చెబుతున్నారు.
ఇదిలాఉంటే ఆగస్టు 8వ తేదీన సైతం ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ముంబై (Mumbai) కి చెందిన ఎయిర్ ఏసియా విమానం రాంచీ విమానాశ్రయంలో టేకాఫ్ తీసుకునే సమయంలో పక్షి ఢీకొట్టడంతో వెనక్కి తిరిగిరావాల్సి వచ్చింది. దీంతో అప్పుడు కూడా ప్రయాణికుల కోసం ఎయిర్ ఏసియా సిబ్బంది ప్రత్యామ్నాయంగా విమానాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఘటనల్లో ఎలాంటి నష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. Skincare Tips: మీ చర్మం పొడిబారుతుందా.. ఈ చిట్కాలు పాటించండి