కరోనా వైరస్ (CoronaVirus) వచ్చినా మరో వైరస్ వచ్చినా తగ్గేది లేదంటున్నారు భారతీయులు. కరోనా కష్టకాలంలోనూ ఆన్‌లైన్‌లో ఎక్కవగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్ బిర్యానీ కావడం గమనార్హం. భారతీయులకు బిర్యానీ అంటే ఎంత ఇష్టమో తాజా రిపోర్టులో తేలింది. COVID19 Vaccine: కరోనా వ్యాక్సిన్‌పై రష్యా శుభవార్త


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్టాట్‌ఈటిస్టిక్స్ ద క్వారంటైన్ ఎడిషన్ చేసిన సర్వేలో ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీలో అధికంగా 5.5లక్షల మంది తమ ఫెవరెట్ ఫుడ్‌గా బిర్యానీని ఆర్డర్ చేసుకున్నారు. బిర్యానీ తర్వాత బటర్ నాన్ 3,35,185 ఆర్డర్లు, మసాలా దోశ 3,31,423 ఆర్డర్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ సమయంలోనూ బిర్యానీకే జై కొట్టారు. దీంతో వరుసగా నాలుగో ఏడాది ఎక్కువ మంది ఆర్డర్ చేసిన ఫుడ్‌గా బిర్యానీ నిలిచింది. బికినీలో టైటిల్ నెగ్గిన నటి హాట్ హాట్‌గా..


స్వీట్ విషయంలోనూ ఏ మాత్రం తగ్గలేదు. తమకెంతో ఇష్టమైన చాకో లావా కేక్‌ను 1,29,000 మంది ఆర్డర్ చేయగా..గులాబ్ జామ్‌ను 84,558 ఆర్డర్లు, బటర్ స్కాచ్ మౌస్ కేక్ 27,317 మంది ఆర్డర్ చేశారు. 73 వేల శానిటైజర్ బాటిల్స్, 47 వేల ఫేస్ మాస్కులను సైతం డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. Sanitizer: పదే పదే శానిటైజర్‌ వాడొద్దు.. ఎందుకో తెలుసా?
వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్