Jan Dhan accounts hacked: కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న బిట్​కాయన్​ కుంభకోణంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, హెచ్​డీ కుమార స్వామి ఈ విషయంపై (HD Kumaraswamy on Bitcoin scam) సంచలన ఆరోపణలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జన్ ధన్​ఖాతాలను కూడా హ్యాక్​ చేసి ఒక్కో ఖాతా (Jan Dhan Accounts hacked) నుంచి కనీసం 2 రూపాయల చొప్పున కొల్లగొట్టినట్లు ఆరోపించారు. ఇలా మొత్తం రూ.6 వేల కోట్లు దోచుకున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి తన వద్ద సమాచారముందని తెలిపారాయన. దీనికి కూడా బిట్​కాయిన్ కుంభకోణం నిందితుడే ప్రధాన సూత్రధారి అని (Bitcoin scam accused hacked Jan Dhan accounts) పేర్కొన్నారు. ఈ విషయం ప్రధానికి తెలుసనుకుంటా అని ఆయన సంచలన ఆరోపణలకు తెరలేపారు.


ఇంతకీ ఏమిటి ఈ బిట్​కాయిన్ కుంభకోణం


అక్రమ హ్యాకింగ్​కు పాల్పడుతున్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేయగా విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. క్రిప్టో ఎక్స్ఛేంజ్‌లను హ్యాక్‌ చేసి, వాటి నుంచి రూ.2 వేల కోట్లకుపైగా విలువ చేసే 5000 బిట్‌ కాయిన్స్‌ దొంగిలించినట్లు అతడు  చెప్పినట్లు తెలిసింది.


Also read: Kangana Ranaut Freedom 2014: కంగనా రనౌత్ ఓ బిచ్చగత్తె.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు


ఆయితే ఆ వ్యక్తి విచారణలో పలువురు బీజేపీ నేతల పేర్లు చెప్పడనే సమాచారం రావడంతో ఇది రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. అతడు బలవంతంగా కొంత మంది నేతల ఖాతాల్లోకి భారీగా బిట్​కాయిన్లు, నగదు బదిలీ చేసినట్లు కూడా చెప్పుకొచాడు.


అయితే నిజానికి ఆ వ్యక్తిని పోలీసులు గతంలో జరిగిన ఓ హత్య కేసులో భాగంగా అరెస్టు చేయగా ఈ విషయాలు బయటకు వచ్చాయి.


Also read: Bengaluru Express: రైలుపై విరిగిపడిన కొండచరియలు...పట్టాలు తప్పిన బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌..


Also read: smoking inside flight: విమానంలో సిగరెట్ తాగిన ఆంధ్ర వ్యక్తి- చైన్నై ఎయిర్​ పోర్ట్​లో అరెస్ట్


సమగ్ర దర్యాప్తునకు డిమాండ్..


ఈ కుంభకోణంల బీజేపీ నేతల హస్తం ఉందనే కారణంతో.. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని కాంగ్రెస్​ నేత, కర్ణాటక మాజీ ముఖ్య మంత్రి సిద్ధ రామయ్య.. సీఎం బసవరాజ్​ బొమ్మైని డిమాండ్ చేశారు. కొంత మంది బీజేపీ నేతల వద్ద బిట్​కాయిన్లు ఉన్నట్లు తన వద్ద సమాచారం ఉందని.. అయితే అవి ఎలా వచ్చాయనే విషయంపై దర్యాప్తు చేయించాలన్నారు సిద్ధారామయ్య. అవసరమైతే కోర్టుకు తన వద్ద ఉన్న సాక్ష్యాలు అందచేస్తానన్నారు.


ఈ ఆరోపణలపై బీజేపీ కూడా స్పందించింది. కాంగ్రెస్ నేతల వద్ద ఈ కుంభకోణాల గురించి సమాచారం ఉంటే.. సుప్రీం కోర్టుకు సమర్పించొచ్చని తెలిపింది. ఇందుకు తాము అభ్యంతరం చెప్పమని ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తుందన్నారు.


Also read: Flex Fuel Engines: గుడ్ న్యూస్..తగ్గనున్న పెట్రో-డీజిల్ ధరలు..లీటర్‌కు రూ.62: నితిన్ గడ్కరీ


Also read: Surat: చరిత్ర సృష్టించిన పోక్సో కోర్టు ..చిన్నారి హత్యాచార కేసులో 5 రోజుల్లోనే తీర్పు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook