Flex Fuel Engines: గుడ్ న్యూస్..తగ్గనున్న పెట్రో-డీజిల్ ధరలు..లీటర్‌కు రూ.62: నితిన్ గడ్కరీ

పెట్రోలు మరియు డీజిల్ ధరల పెరుగుదల టెన్షన్‌ను వదిలేయండి, వాటి ధర రూ. 62 అవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.. రష్యన్ టెక్నాలజీ గురించి ప్రస్తావిస్తూ.. ఇథనాల్ వాడకం గురించి తెలిపారు.. ఇంకా ఏమన్నారంటే..??

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2021, 02:19 PM IST
  • మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ కార్యక్రమంలో మాట్లాడిన గడ్కరీ
  • పెరుగుతున్న పెట్రో-డీజిల్ ధరల గురించి బయపడకండన్న మంత్రి
  • లీటర్ ధర 62 రూపాయలు అవుతుందన్న నితిన్ గడ్కరీ
Flex Fuel Engines: గుడ్ న్యూస్..తగ్గనున్న పెట్రో-డీజిల్ ధరలు..లీటర్‌కు రూ.62: నితిన్ గడ్కరీ

Flex Fuel Engines to be Mandatory Soon in India Said Nitin Gadkari: కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ (Union Transport Minister Nitin Gadkari) వాహనాల్లో ఇథనాల్ (Ethanol) వాడకంపై మరోసారి నోరు విప్పారు. వాహనాల్లో ఇథనాల్ వాడకం వలన ప్రజలపై ఆర్ధిక భారం తగ్గటమే కాకుండా.. కాలుష్యం కూడా తక్కువే అని తెలిపారు. రాబోయే కొన్ని రోజుల్లో భారతదేశంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్‌లను (Flex-Fuel Engines) తప్పనిసరిగా తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఫ్లెక్స్-ఫ్యూయల్ లేదా ఫ్లెక్సిబుల్ ఫ్యూయల్ (Flexible Fuel) అనేది గ్యాసోలిన్ (Gasoline), మిథనాల్ (Methanol) లేదా ఇథనాల్ (Ethanol) మిశ్రమంగా ఉండే ప్రత్యామ్నాయ ఇంధన విధానం. 

రష్యన్ టెక్నాలజీ గురించి ప్రస్తావన 
మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (Maharashtra State Cooperative Bank) కార్యక్రమంలో నితిన్ గడ్కరీ (Nitin Gadkari) మాట్లాడుతూ, పెట్రోల్ (Petrol) మరియు ఇథనాల్ యొక్క క్లోరిన్ (Chlorine) విలువ సమానంగా మారే రష్యన్ టెక్నాలజీ గురించి తెలిపారు. అంతేకాకుండా.. చెరకు ఎక్కువగా పండే ఎక్కువగా పశ్చిమ మహారాష్ట్ర (Western Maharashtra) గురించి ప్రస్తావిస్తూ.. త్వరలో పెట్రోల్ పంపులకు బదులుగా ఇథనాల్ పంపులను (Ethanol Pump) ఏర్పరుస్తామని గడ్కరీ తెలిపారు. మహారాష్ట్రలో ఇప్పటికే 3 ఇథనాల్ పంపులు పని చేస్తున్నాయని, అలాగే పశ్చిమ మహారాష్ట్రలో 100 శాతం ఇథనాల్‌తో ఆటో రిక్షాలు నడిపేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించామని గడ్కరీ తెలిపారు. 

Also Read: Sania Mirza Supports Pakistan: సానియా మీర్జా భారత పౌరసత్వాన్ని రద్దు చేయండి.. సోషల్ మీడియాలో ట్రోలింగ్

దేశంలో ఇంధన ఎగుమతులు తగ్గుతాయి 
పెట్రోల్ కన్నా ఇథనాల్ ఎక్కువ పరిమాణంలో లభ్యం అయితే.. చెరకు రైతులతో పాటు చక్కెర మిల్లు యజమానులు ప్రయోజనం పొందటంతో పాటు... భారతదేశం దిగుమతి చేసుకునే ఇంధన పరిమాణం కూడా తగ్గుతుంది. నితిన్ గడ్కరీ మాటలాడుతూ... "ఇటీవల టయోటా (Toyota) మరియు కిర్లోస్కర్‌ కంపెనీ (Kirloskar) వాటితో మీటింగ్లో పాల్గొన్నానని.. వారు ఫ్లెక్స్ ఇంజిన్‌తో  (Flex Engine) కార్లను తయారు చేస్తున్నారని.. ఈ ఇంజన్ ఉన్న వాహనాలు 100 శాతం పెట్రోల్ లేదా ఇథనాల్‌తో పనిచేస్తాయని తెలిపారు. ఇది యూరో 6 నిబంధనల (Euro 6 Norms) ప్రకారం తయారు చేయబడిందని మరియు దీన్ని మన దేశంలో తప్పని సరిగా చేయబోతున్నామని" ఆయన తెలిపారు.

లీటర్ ఇథనాల్ ధర రూ.62
నితిన్ గడ్కరీ ఇంకా మాట్లాడుతూ... "పెట్రోలు వాడొద్దు.. పెరుగుతున్న పెట్రోల్ - డీజిల్ (Petrol- Diesel) ధరల గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు.. కాలుష్య రహిత వాహనాలను ప్రోత్సహించేందుకు గడ్కరీ ఢిల్లీలో గ్రీన్ హైడ్రోజన్ కారును (Green Hydrogen Car) ఉపయోగించనున్నారు. కార్పొరేట్ రంగం కంటే ముందు సహకార రంగం హైడ్రోజన్ టెక్నాలజీని (Hydrogen Technology) ఉపయోగించడం ప్రారంభిస్తే, దాని మొదట ప్రయోజనం కూడా పొందవచ్చని ది మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవే (The Minister of Road Transport and Highways) వారు కూడా తెలిపారు". 

Also Read: Mega Collaboration: చిరు-సల్మాన్ చిందేయనున్న పాట కోసం 'బ్రిట్నీ స్పియర్స్‌'..??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News