BJP appoints former CM Devendra Fadnavis as Bihar election in-charge: ఢిల్లీ: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు (Bihar Assembly election 2020) త్వరలోనే జరగనున్నాయి. ఈ మేరకు కేంద్రం ఎన్నికల సంఘం (CEC) కూడా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అక్టోబరు 28, నవంబరు 3, నవంబరు 7వ తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. నవంబరు 10న ఓట్ల లెక్కిపు, ఫలితాలు వెలువడనున్నాయి. అయితే త్వరలో జరగనున్న బీహార్ సంగ్రామానికి బీజేపీ (BJP) కసరత్తులు ప్రారంభించింది. బీహార్ బీజేపీ ఇన్‌చార్జ్‌గా మ‌హారాష్ర్ట మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌విస్‌ (Devendra Fadnavis) ను ఆ పార్టీ నియ‌మించింది. బీహార్ ఎన్నికలపై బుధవారం రాష్ర్ట బీజేపీ నాయ‌కుల‌తో ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా (JP Nadda) స‌మావేశ‌మై చ‌ర్చించారు. మూడు ద‌శ‌ల్లో జరగనున్న ఎన్నిక‌ల పోలింగ్‌, వ్యూహాలు, అదేవిధంగా జేడీయూ, ఎల్‌జేపీతో (JDU-LJP) సీట్ల స‌ర్దుబాటు వంటి త‌దిత‌ర‌ అంశాల‌పై నడ్డా నాయకులతో చ‌ర్చించారు. Also read: Bihar Assembly Elections: బీహార్ అసెంబ్లీ పోరుకు షెడ్యూల్ విడుదల


అయితే.. ఈ స‌మావేశం అనంత‌రం భారతీయ జనతా పార్టీ బీహార్ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా దేవేంద్ర ఫ‌డ్న‌విస్‌ను నియమిస్తూ అధికారికంగా వెల్లడించింది. ఇదిలాఉంటే.. ఫడ్నవిస్ బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై కొన్నిరోజులుగా పార్టీ అంతర్గత సమావేశాల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా పొత్తులపై కూడా రాష్ట్రంలో పర్యటించారు ఫడ్నవిస్. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం శివసేన నేత, ఎంపీ సంజయ్ రౌత్‌తో కూడా రహస్యంగా భేటి అయ్యారు. అయితే ఈ భేటీపై తర్వాత క్లారిటీ కూడా ఇచ్చారు సంజయ్ రౌత్. సామ్నాలో ఇంటర్వ్యూ అదేవిధంగా కొన్ని విషయాలపై చర్చించేందుకు సమావేశమైనట్లు వెల్లడించారు. Also read: Bihar Elections: 50 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఎన్నికలకు దూరంగా ఆ ముగ్గురు నేతలు