Bihar Assembly Elections: బీహార్ అసెంబ్లీ పోరుకు షెడ్యూల్ విడుదల

దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో బీహార్ ఎన్నికల (Bihar Assembly Elections) పై నెలకొన్న సందిగ్ధత వీడింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం.. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించింది. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం (CEC) వెల్లడించింది. 

Last Updated : Sep 25, 2020, 03:13 PM IST
Bihar Assembly Elections: బీహార్ అసెంబ్లీ పోరుకు షెడ్యూల్ విడుదల

Bihar assembly election 2020 to be held in three phases: న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలో బీహార్ ఎన్నికల (Bihar
Assembly Elections) పై నెలకొన్న సందిగ్ధత వీడింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం.. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించింది. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అక్టోబరు 28న తొలివిడత పోలింగ్‌, నవంబరు 3న రెండో విడత, నవంబరు 7న మూడో విడత పోలింగ్‌ను నిర్వహించి.. నవంబర్ 10న ఫలితాలను వెల్లడించనున్నట్లు సీఈసీ సునీల్‌ అరోరా (Sunil Arora) ఢిల్లీలో వెల్లడించారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీ గడువు నవంబర్‌ 29తో ముగియనుంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషన్ ఇప్పటికే పలు పార్టీల అభిప్రాయాలను సైతం తీసుకుంది. కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో చాలా పార్టీలు బీహార్ ఎన్నికలను వాయిదా వేయాలని సూచించినప్పటికీ ఎన్నికల సంఘం.. ఎన్నికలు నిర్వహించేందుకేమొగ్గుచూపింది. అయితే బీహార్‌లో ఉన్న 243 స్థానాల్లో 38 సీట్లను ఎస్సీ, ఎస్టీల‌కు కేటాయించారు. అయితే.. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని 15 రాష్ట్రాల్లో ఖాళీ అయిన మరో 64 స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. Also read: 
Ram Gopal Varma: రేపే దిశా ఎన్‌కౌంటర్ ట్రైలర్

అయితే.. కరోనా కేసులు పెరుగుతున్న వేళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో.. ఎన్నికల సంఘం ప్రత్యేక మార్గదర్శకాలు, చర్యలతో ఎన్నికల నిర్వహణకు నడుంబిగించింది. బీహార్ ఎన్నికల్లో బహిరంగ సభలు, ర్యాలీలకు ఈసీ అనుమతి నిరాకరిస్తున్నట్లు సీఈసీ సునీల్ ఆరోరా వెల్లడించారు. నామినేషన్ల ప్రక్రియను ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద శానిటైజర్లను సైతం అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. అయితే పోలింగ్ స‌మ‌యాన్ని ఉద‌యం 7 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు నిర్ధారించారు. చివరి గంటలో కోవిడ్ రోగులను అనుమతించనున్నట్లు వెల్లడించారు. అయితే ఆ ఒక్కగంట తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు వర్తించదని ఆరోరా తెలిపారు. దీంతోపాటు ఒక్కొక్క పోలింగ్ బూత్‌లో 1000మంది ఓటర్లను మాత్రమే అనుమతించనున్నారు. సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు, ఫేస్ షీల్డ్‌లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. 80 ఏళ్లు పైబడిన వారికే పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు అరోరా వెల్లడించారు. Also read: SP Balasubrahmanyam dies: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరు

అక్టోబరు 28న మొదటి విడతలో భాగంగా 16 జిల్లాల్లో..  71 అసెంబ్లీ స్థానాల‌కు 31 వేల పోలింగ్ స్టేష‌న్ల‌లో ఎన్నిక‌లు జ‌రుగనున్నాయి. 
నవంబరు 3న రెండ‌వ విడతలో భాగంగా 17 జిల్లాల్లో.. 94 స్థానాల‌కు 42 వేల పోలింగ్ స్టేష‌న్ల‌లో ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. 
నవంబరు 7న మూడ‌వ విడతలో భాగంగా 15 జిల్లాల్లో.. 78 స్థానాల‌కు 33వేలకుపైగా పోలింగ్ స్టేష‌న్లలో ఎన్నికలు జరగనున్నాయి.  
నవంబరు 10న ఓట్లను లెక్కించి తుది ఫలితాలను వెల్లడిస్తారు. 
Also read: Pawan Kalyan: రెమ్యునరేషన్ విషయంలో పవన్ కళ్యాణ్ రూటు మారిందా?

Trending News